For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంట్లో క్లాస్ పీకారు, అమ్మ అబద్దం చెప్పింది, చిరు డాన్స్ అంటే పిచ్చి: అఖిల్

  By Bojja Kumar
  |
  ఇంట్లో క్లాస్ పీకారు ! చిరు డాన్స్ అంటే పిచ్చి..!

  మొదటి సినిమాతో సక్సెస్ అందుకోలేని అక్కినేని యువహీరో అఖిల్... ఆ పరాజయం నుండి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాడు. త్వరలో అఖిల్ 'హలో' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

   మొదట శివ సినిమా నచ్చలేదు

  మొదట శివ సినిమా నచ్చలేదు

  అమ్మా నాన్న కలిసి నటించిన ట్రెండ్ సెట్టర్ మూవీ ‘శివ' తొలిసారి చూసినపుడు తనకు నచ్చలేదని, అపుడు చిన్నపిల్లాన్ని కావడం వల్ల అర్థమే కాలేదని, ఆ సినిమాను ఇప్పటికీ 22 సార్లు చూశాను. 16వ సారి చూసినపుడు సినిమా నచ్చింది అని అఖిల్ తెలిపారు.

   అఖిల్ ప్లాపవ్వడం మంచిదే అయింది

  అఖిల్ ప్లాపవ్వడం మంచిదే అయింది

  నా తొలి సినిమా ‘అఖిల్' ప్లాపవ్వడం మంచిదే అయ్యింది. హిట్‌ అయితే, అవే తరహా కథలు చేసేవాడ్నేమో. నా తప్పులు అర్థమయ్యేవి కావు. అందరూ చేసే రొటీన్ కథలు వీడు చేస్తున్నాడనే కామెంట్స్ రావడంతో కాస్త కుంగిపోయిన మాట నిజమే. ‘అఖిల్' ప్లాపవ్వడం వల్లే ‘హలో' లాంటి కొత్త తరహా కథల వైపు దృష్టి పెట్టాను అని తెలిపారు.

   నా జీవితాన్ని మార్చే సినిమా అవుతుంది

  నా జీవితాన్ని మార్చే సినిమా అవుతుంది

  ‘అఖిల్' ప్లాప్ తర్వాత లెక్కలేనన్ని కథలు విన్నాను. కాస్త గ్యాప్ వచ్చినా సరే గర్వపడే సినిమానే చేయాలనుకొన్నా. పర్సనల్ గా కూడా ఆ కథ నాకు కనెక్ట్ అయ్యేలా ఉండాలనుకున్నాను. అలాంటి కథ విక్రమ్‌ కె కుమార్‌ వినిపించారు. ‘హలో' నా జీవితాన్ని మార్చే సినిమా అవుతుంది అని అఖిల్ తెలిపారు.

   ‘హలో' కోసం నాన్న

  ‘హలో' కోసం నాన్న

  నాన్న ముఫ్ఫై ఏళ్ల అనుభవం ‘హలో'కి బాగా పనికొచ్చింది. ఆయన సపోర్టుగా ఉండటం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ‘నువ్వూ ఇవన్నీ చూసుకోవాలి. లేకపోతే సెట్లో ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు' అంటూ నాకూ కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఈ అనుభవాలన్నీ భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడతాయి అని అఖిల్ తెలిపారు.

   తాత గొప్పదనం తెలిసే నాటికి దూరం అయ్యారు

  తాత గొప్పదనం తెలిసే నాటికి దూరం అయ్యారు

  తాతయ్యను ఏఎన్నార్‌లా చూసేవాడ్ని కాదు. ఓ తాతలానే ఆడుకునేవాడ్ని. ఆయన గొప్పదనం తెలిసే వయసు నాకు వచ్చే సరికి ఆయన దూరం అయ్యారు. ఆయన ఇపుడు ఉండి ఉంటే ఎన్నో విలువైన పాఠాలు బోధించేవారో అనిపిస్తోంది. తాతయ్య తనకిష్టమైన వృత్తిలో చివరి నిమిషం వరకూ పనిచేయగలిగారు. మంచంపై ఉండి డబ్బింగ్‌ చెప్పారు. జీవితమంటే.. అలా ఉండాలి. కోట్లలో ఒక్కరికే దొరికే జీవితం అది... అని అఖిల్ తెలిపారు.

   అమ్మ అబద్ధం చెప్పింది

  అమ్మ అబద్ధం చెప్పింది

  నాకు స్పోర్ట్స్‌ అంటే ఇష్టం. అందులో క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. అండర్‌ 17 వరకూ జాతీయ జట్టులో ఆడాలనుకునేవాణ్ని. క్రికెట్‌ అంటే ఎంత పిచ్చి అంటే కొన్నిసార్లు వ్యక్తిగతంగా తీసుకొంటుంటా. నాకు, నాన్నకి సచిన్‌, విరాట్‌ కోహ్లిలంటే ఇష్టం. నేను మాసం ఎక్కువ తింటుండటంతో సచిన్‌ బెండకాయ తింటాడని అబద్దం చెప్పి అమ్మ నాతో నాతో బెండకాయ తినిపించింది. సచిన్‌ అంటే అంత పిచ్చి నాకు. నేను ఇప్పటిదాకా చదివిన ఒకే ఒక పుస్తకం... సచిన్‌ ఆటోబయోగ్రఫీ అని అఖిల్ తెలిపారు.

   వెంకీ మామయ్యతో

  వెంకీ మామయ్యతో

  వెంకీ మామ అంటే మొదట్నుంచీ నాకు చాలా ఇష్టం. ఇద్దరం కలిస్తే ముందు తిండి గురించి మాట్లాడతాం. తర్వాతే టీమ్‌ గురించి, క్రికెట్‌ గురించి మాట్లాడతాం. వీడికి క్లాస్ తీసుకోవడం ఇష్టం ఉండదని ఆయనకు ముందే తెలుసు కాబట్టి నాకు వెంకీ మామ ఎప్పుడూ క్లాస్‌ తీసుకోరు అని... అఖిల్ తెలిపారు.

   చిరంజీవి డాన్స్ అంటే పిచ్చి

  చిరంజీవి డాన్స్ అంటే పిచ్చి

  నాకు చిరంజీవి డాన్స్‌ అంటే పిచ్చి. ‘అమ్మడు కుమ్ముడూ' పాటని ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. ఆ లక్షణాలే రామ్‌చరణ్‌కి వచ్చాయి. ఇక ఎన్టీఆర్‌ డాన్స్‌ గురించి చెప్పేదేముంది? తనని పట్టుకోవడం చాలా కష్టం.... నాకు డాన్స్ చేయడం పెద్దగా రాదు. అథ్లెట్ బాడీ కాబట్టి బాడీ ఎలా అంటే అలా బెండ్ అవుతుంది. అలా ఏదో మేనేజ్ చేస్తున్నాను అని అఖిల్ తెలిపారు.

   ఇంట్లో క్లాస్‌ పీకారు...

  ఇంట్లో క్లాస్‌ పీకారు...

  ‘నా బాల్యం చాలా సరదాగా గడిచిపోయింది. అప్పుడప్పుడు స్కూల్‌కి బంక్‌ కొట్టడం, రాత్రిళ్లలో స్నేహితులతో కలిసి కార్‌ తీసుకొని బయటికి వెళ్లిపోవడం లాంటివి చేసేవాన్ని, నేను చేస్తున్న పనులు ఇంట్లో తెలియడంతో క్లాస్ పీకారు. అయినా అప్పుడప్పుడు నాన్నకి తెలియకుండా గోడ దూకి వెళ్లిపోయేవాణ్ని. అవన్నీ గుర్తుకొస్తే సరదాగా అనిపిస్తుంది అని అఖిల్ తెలిపారు.

  అలాంటి అమ్మాయిలంటే ఇష్టం

  అలాంటి అమ్మాయిలంటే ఇష్టం

  అమ్మాయిల్లో నన్ను ఆకర్షించేవి కళ్లు. వాళ్లలో సరదాగా, ప్రశాంతంగా కనిపించే అమ్మాయిలంటే ఇష్టం. సింపుల్‌గా ఉంటేనే నాకు హ్యాపీ'' అని అఖిల్ తెలిపారు.

  English summary
  Akhil latest movie 'Hello' releasing on Dec 22. In his interview to the Leading Daily, he said in his personal life details.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X