»   » థాంక్యూ వదినా..! అంటూ సమంతా తో అఖిల్

థాంక్యూ వదినా..! అంటూ సమంతా తో అఖిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని చిన్నోడు అఖిల్ తొలి సినిమా పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పెద్ద ప్లాపుల్లో ఈ సినిమా ఒకటి, అయితే ఇప్పుడిప్పుడే ఆ ఫెయిల్యూర్ని మర్చిపోయి మరో సినిమా తో దగ్గర అవుతున్నాడు. అఖిల్ పెళ్లి శ్రీయ భూపాల్‌తో రద్దవ్వడంతో ఈ మద్య కాస్త డిస్ట్రబ్డ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ జ్ఞాపకాల నుండి బయట పడేందుకు వెంటనే తన రెండో సినిమా షూటింగులో బిజీ అవ్వాలని అఖిల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు

ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా తెరకెక్కనుండగా ఇప్పటికే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పూర్తైంది. ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉంది టీం. కట్ చేస్తే అఖిల్ చేసింది ఒక్క సినిమానే అయినప్పటికి ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా సోషల్ మీడియాలో అఖిల్ ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు .

థ్యాంక్స్ చెప్పాడు

థ్యాంక్స్ చెప్పాడు

తాజాగా అఖిల్ ట్విట్టర్ ఫాలోవర్స్ 1 మిలియన్ కి చేరింది. ఈ సందర్బంగా అఖిల్ తన ఫాలోవర్లకు థ్యాంక్స్ చెప్పాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మొదటి సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోయినా.. అఖిల్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. అఖిల్‌ ట్విట్టర్లో మిలియన్‌ ఫాలోవర్లను సంపాదించుకోవడమే దానికి తాజా ఉదాహరణ.

బిలీవర్లు

బిలీవర్లు

తన ఫాలోవర్ల సంఖ్య ఒక మిలియన్‌కు చేరడంతో అక్కినేని అఖిల్‌ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ.. ‘మీరంతా నా ఫాలోవర్లు కాదు.. బిలీవర్లు' అని ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌కు కొద్దిసేపటి తర్వాత సమంత స్పందించింది. ‘నేను నీ బిలీవర్‌ను' అని ట్వీట్‌ చేసింది.

థ్యాంక్‌ యూ వదినా

థ్యాంక్‌ యూ వదినా

దీనికి సమాధానంగా ‘థ్యాంక్‌ యూ వదినా' అని అఖిల్‌ ట్వీట్‌ చేశాడు.ఈ ట్వీట్ తో అక్కినేని అభిమానులలో ఆనందం అవధులు దాటింది. సమంత ఇప్పుడు అక్కినేని కోడలు కాగా పబ్లిక్ గా సామ్ ని అఖిల్ వదిన అని పిలవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే చైతూ- సమంత ల ఎంగేజ్ మెంట్ పూర్తి కాగా త్వరలోనే పెళ్ళి పీటలెక్కబోతున్నారు.

వచ్చేనెల 1 నుంచి

వచ్చేనెల 1 నుంచి

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై వచ్చేనెల 1 నుంచి ఈ కొత్త సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో అఖిల్ పాత్ర పేరు జున్ను అని తెలుస్తోంది. సినిమాలో అంతా అఖిల్ ను జున్ను అనే పిలుస్తారట. అందుకే ఇదే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట.

హీరోయిన్ కోసం వెదుకుతున్నారు

హీరోయిన్ కోసం వెదుకుతున్నారు

మొదటి సినిమాకు తన రియల్ నేమ్ నే సినిమా టైటిల్ గా పెట్టుకున్నాడు అఖిల్. ఇప్పుడు రెండో సినిమాకు తన క్యారెక్టర్ పేరును టైటిల్ గా ఫిక్స్ చేసుకుంటాడేమో చూడాలి. ఇప్పటికే స్క్రీన్ ప్లే లాక్ చేసిన ఈ సినిమాకు హీరోయిన్ కోసం వెదుకుతున్నారు

English summary
"Thank you so much to all my believers ! Not my followers but my believers. For encouraging me and supporting no matter what. 1 million, wow!" Tweets akhil and Says thanks To samantha for Her Re Tweet with a coment "Iam Beleaver"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu