హైదరాబాద్: అక్కినేని 'అఖిల్' తెరంగేట్రం చేస్తున్న చిత్రం 'అఖిల్'. ఈ చిత్రం డాన్స్ ప్రోమోను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈనెల 11న దీపావళి కానుకగా 'అఖిల్' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువనటుడు నితిన్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్రోమోను చూసిన వారు డాన్స్ లు రాకింగ్ గా ఉన్నాయంటున్నారు. మీరూ చూసి ఎలా ఉందో చెప్పండి.
నిర్మాత నితిన్ మాట్లాడుతూ ''అఖిల్ హీరోగా నటించిన తొలి చిత్రమిది. అందుకే సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటికి దీటుగా సినిమాని తెరకెక్కించారు దర్శకుడు. అఖిల్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అనూప్ రూబెన్స్, తమన్ అందించిన గీతాలకి మంచి ఆదరణ లభించింది. సినిమా అదే తరహాలో ప్రేక్షకులకు చేరువవుతుంది. మా నిర్మాణ సంస్థకి మరపురాని చిత్రంగా 'అఖిల్' నిలుస్తుంది''అన్నారు.
మరో ప్రక్క 'అఖిల్' చిత్ర సరికొత్త ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.
Watch: Akkineni Song Promo from Akhil Movie, Starring Akhil Akkineni, Sayyeshaa Saigal in lead roles, Anup Rubens & S. Thaman together composed the music. Written by Veligonda Srinivas and Directed by VV Vinayak, Produced jointly by actor Nithiin and his father Sudhakar Reddy on Sreshth Movies banner. Stay tuned to Shresht Water Purfiers Official Channel for more Videos...
Story first published: Tuesday, November 10, 2015, 14:07 [IST]