For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మా, నాన్న గర్వపడేలా చేస్తా: ‘హలో’ ఆడియో వేడుకలో అఖిల్ ఎమోషనల్ స్పీచ్

  By Bojja Kumar
  |
  అఖిల్ ఎమోషనల్ స్పీచ్...!

  అఖల్ హీరోగా తెరకెక్కిన 'హలో' మూవీ ఆడియో వేడుక వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అదిరిపోయే డాన్స్ చేసిన అఖిల్.... ఆ తర్వాత మైక్ అందుకుని ఎమోషనల్‌గా మాట్లాడారు. 'గడిచిన సంవత్సర కాలం నా జర్నీ ఎంతో ఎమోషనల్‌గా సాగింది. మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ ఈ రోజు ఇలా ఇంత కాన్ఫిడెంట్‌గా నిలుచున్నాను అంటే కారణం మా అమ్మా నాన్న' అని అఖిల్ వ్యాఖ్యానించారు.

   వారు నా లైఫ్‌లో లేకుంటే?

  వారు నా లైఫ్‌లో లేకుంటే?

  ‘అమ్మా, నాన్న నా లైఫ్ లో లేకుంటే ఏం జరిగేదో నాకు తెలియదు. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేను కేవలం థాంక్స్ తో సరిపెట్టను.... వారు గర్వపడేలా చేస్తాను.' అని అఖిల్ భావోద్వేగానికి గురయ్యాడు.

   అప్పుడు నా పరిస్థితి అదీ

  అప్పుడు నా పరిస్థితి అదీ

  "డైరెక్టర్ విక్రమ్ నన్ను కలిసినపుడు నేను నటన పరంగా చాలా తక్కువగా ఉన్నాను. ఎనర్జీ లెవల్స్‌తో పాటు కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. హలో సినిమా ద్వారా నేను అన్ని విషయాల్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. నీకు నేను కేవలం థాంక్స్ తో సరిపెట్టను. నాకు నువ్వు అన్నయ్య లాంటి వాడివి." అని అఖల్ అన్నారు.

  డాన్స్ చేసి అదరగొట్టిన అఖిల్

  హలో ఆడియో వేడుకలో అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ తమ డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

   అభిమానులతో పాటు నేనూ వెయిట్ చేస్తున్నాను: అమల

  అభిమానులతో పాటు నేనూ వెయిట్ చేస్తున్నాను: అమల

  ఈ వేడుక చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అక్కినేని అమల తెలిపారు. అనూప్ రూబెన్స్ గారు ఎంతో అద్భుతమైన సంగీతం అందించారని తెలిపారు. సినిమాటోగ్రాఫర్ వినోద్ గారు తన కెమెరాతో మ్యాజిక్ చేశారు. ప్రతి ఫ్రేము ఎంతో బాగా చూపించారు. కళ్యాణికి అద్భుతమైన భవిష్యత్‌ ఉంటుంది. విక్రమ్‌కి ఇదొక గ్రేట్‌ సక్సెస్‌గా నిలుస్తుంది. అక్కినేని అభిమానులతో పాటు నేను కూడా డిసెంబర్‌ 22 కోసం వెయిట్‌ చేస్తున్నాను అని అమల తెలిపారు.

   డిసెంబర్ అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్

  డిసెంబర్ అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్

  వీడియో మెసేజ్ ద్వారా నాగ చైతన్య మాట్లాడుతూ.... `హలో` సినిమా కోసం యూనిట్‌ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అఖిల్‌ను ఓ లవ్‌స్టోరీలో చూడాలనే కోరిక ఉండేది. తను చాలా బాగా డ్యాన్స్, ఫైట్స్‌ చేస్తాడు. `హలో` సినిమాలో బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీ ఉంది. ప్రేమ కథా చిత్రాలను విక్రమ్‌ కంటే గొప్పగా ఎవరూ తీయలేరు. అనూప్‌కి ఇది 50వ సినిమా. తనకు కంగ్రాట్స్‌. డిసెంబర్‌ నెల అక్కినేని వారికి స్పెషల్‌. ఈ నెలలో విడుదలైన సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. ఈ నెలలోనే హలో విడుదలవుతుండటం ఆనందంగా ఉంది అని చైతన్య తెలిపారు.

   మ్యాజిక్‌ను రీ క్రియేట్‌ అవుతుంది: సమంత

  మ్యాజిక్‌ను రీ క్రియేట్‌ అవుతుంది: సమంత

  సమంత అక్కినేని మాట్లాడుతూ - ''డిసెంబర్‌ 22 అక్కినేని ఫ్యామిలీకి, అభిమానులకు స్పెషల్‌ డే అవుతుంది. `హలో` సినిమాకు పనిచేసిన వారందరూ 'మనం' సినిమాకు పనిచేసినవారే. 'మనం' మ్యాజిక్‌ను రీ క్రియేట్‌ చేస్తారని నమ్ముతాను. అఖిల్‌ కచ్చితంగా అదరగొడతాడు... అని సమంత వ్యాఖ్యానించారు.

   హీరోయిన్ తండ్రి, డైరెక్టర్ ప్రియదర్శన్ స్పీచ్

  హీరోయిన్ తండ్రి, డైరెక్టర్ ప్రియదర్శన్ స్పీచ్

  డైరెక్ట‌ర్ ప్రియదర్శన్‌ మాట్లాడుతూ - ''నలభై ఏళ్ల సినీ అనుభవంలో దర్శకుడిగా 92 సినిమాలు చేశాను. తెలుగులో చేసిన రెండు సినిమాల్లో ఏఎన్ఆర్ గారితో ఒకటి, నాగార్జున-అమలతో కలిసి ఒక సినిమా చేశాను. అయితే ఈ క్షణం నా జీవితంలో మరచిపోలేని క్షణం. నా కూతురు కళ్యాణి అక్కినేని అఖిల్‌ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. నా ఫేవరేట్‌ శిష్యుడు, నా కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్న విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మా అమ్మాయి పరిచయం కావడం మరింత ఆనందంగా ఉంది. విక్రమ్‌ కుమార్‌ నాకు ఇచ్చే గురుదక్షిణ ఇంత కంటే ఇంకేం ఉంటుంది అని ప్రియదర్శన్ వ్యాఖ్యానించారు.

  English summary
  Akhil Akkineni Emotional Speech At HELLO Audio Launch. Hello Movie Audio Launch event held at Vizag on Sunday. Directed by VikramKKumar, Music Composed By AnupRubens, Produced by Nagarjuna Akkineni under Annapurna Studios.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X