For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఖిల్ అక్కినేని పేరుతో మోసం, దేహశుద్ది చేసిన యువతి

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: మనం సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ తోనే అఖిల్ అక్కినేని పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. సినిమా ఫ్యామిలీ నుండి రావడం కూడా అతనికి కలిసొచ్చింది. కాలేజీ గర్ల్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న హీరోల జాబితాలో అఖిల్ కూడా చేరి పోయాడు. సోషల్ మీడియాలో అతన్ని ఫాలో అవతున్న అమ్మాయిల సంఖ్య తక్కువేమీ కాదు.

  అఖిల్ మీద అమ్మాయిలకు ఉన్న మోజును ఆసరాగా చేసుకుని కొందరు ఫేక్ అకౌంట్స్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నాడు. అభినవ్ అనే యువకుడు అఖిల్ పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి మోసాలకు పాల్పడం, అతన్ని నిజంగానే అఖిల్ గా నమ్మి పలువురు అమ్మాయిలు మోస పోవడం కూడా జరిగిపోయింది. అయితే వీరిలో ఓ అమ్మాయి అభినవ్ మోసాన్ని పసిగట్టి అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.

  ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  Akhil Akkineni name in Fraud case

  అఖిల్ సినిమా విషయానికొస్తే...

  వివి వినాయక్ దర్శకత్వంలో నాగార్జున వారసుడు అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభం అయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అకిల్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో పాటు పలువురు హీరోలకు తండ్రి పాత్రలో నటించిన రాజేంద్రప్రసాద్ అఖిల్ సినిమాకు కూడా అలాంటి పాత్రనే పోషించడం విశేషం.

  అఖిల్ తెరంగ్రేటం విషయంలో నాగార్జున చాలా కేర్ తీసుకుంటున్నారు. డైరెక్టర్ ఎంపిక దగ్గర నుండి అన్ని విషయాలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అఖిల్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఇటీవల శిల్ప కళా వేదికలో భారీగా వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ అక్కినేని అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

  ఈ సినిమాలో సాయేషా సైగల్ అనే అమ్మాయిని హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ దిలీప్ కుమార్, అతని భార్య సైరా భానులకు రిలేటివ్ అయిన సాయేషా సైగల్ అఖిల్ సినిమా ద్వారా తెరంగ్రేటం చేయచోతోంది.

  ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకపై నిఖిత రెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్నారు. ఈ విషయమై నితిన్ స్పందిస్తూ....‘ప్రొడక్షన్ ఎ' లాంచ్ చేసాము. నిర్మాతగా ఇదే నా తొలి సినిమా. అఖిల్ నటిస్తున్న తొలి చిత్రం. మీ అందరి సపోర్టు కావాలి' అని కోరారు.

  ఫైట్ సీన్లతో షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వినాయక్ పోకడ చూస్తుంటే అఖిల్‌ను పూర్తి మాస్ హీరోగా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అక్కినేని అఖిల్ లాంచింగ్ కోసం అక్కినేని కుటుంబ అభిమానులే కాకుండా తెలుగు సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. అందుకే తొలి చిత్రం ప్రయోగాల జోలికి పోకుండా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు.

  వినాయక్ శైలి యాక్షన్, వినోదం మేళవింపుతో రూపొందనున్న ఈ చిత్రంలో అఖిల్ పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండనుంది. షూటింగ్ త్వరత గతిన పూర్తి చేసి వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు.

  English summary
  Abhinav, a young man from Hyderabad using actor Akhil Akkineni name for Fraud.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X