For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఖిల్‌‌కు కొత్తగా లవ్ ప్రపోజల్.. చేసింది ఎవరో తెలుసా? పారిపోయిన సిసింద్రీ

  By Rajababu
  |

  అఖిల్ అక్కినేని పెళ్లి గురించి, అఫైర్ల గురించి ఈ మధ్యకాలంలో బాగానే రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ అలాంటి వాటికి దూరంగా ఉంటూ ప్రస్తుతం అఖిల్ బుద్దిగా కెరీర్‌పైనే దృష్టిపెట్టాడు. పెళ్లి, ప్రేమ వ్యవహరాలను దూరంగా పెట్టి దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమా కోసం కష్టపడుతున్నాడు. తాజాగా రాజమౌళి, రమ దంపతుల కుమారుడు కార్తీకేయతో కలిసి రానా నిర్వహించే యారీ నంబర్ 1 షోకు గెస్ట్‌గా వెళ్లాడు. ఈ కార్యక్రమంలో తన తొలి సినిమా అనుభవాలను, తనకు ఒకరు చేసిన లవ్ ప్రపోజల్ గురించి ఆసక్తికరంగా వివరించాడు.

  వినాయక్ కథ చాలా కొత్తగా అనిపించింది.

  వినాయక్ కథ చాలా కొత్తగా అనిపించింది.

  రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న యారీ నంబర్ 1లో మాట్లాడుతూ.. దర్శకుడు వీవీ వినాయక్ అఖిల్ సినిమా కథ చెప్పినప్పుడు కొత్తగా ఉందనిపించింది. ఓ కొత్త హీరో చేయగల కథ ఇదే అని నేను నమ్మాను. అందుకే ఆ కథకు ఓకే చెప్పి తొలిచిత్రంగా చేశాను. కానీ ఆ సినిమా చేసేటప్పుడే నేను తప్పు చేశానను అని అర్థమైంది. అప్పుడు ఇక చేసేది ఏమీ లేకపోయింది అని అఖిల్ వివరించారు.

  విమానంలో లవ్ ప్రపొజల్

  విమానంలో లవ్ ప్రపొజల్

  సరదాగా సాగిన కార్యక్రమంలో ఎవరైనా ఈ మధ్యలో నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానం ఇస్తూ.. ఈ మధ్య విమానంలో ప్రయాణించేటప్పుడు ఓ సరదా సంఘటన ఎదురైంది. నేను హైదరాబాద్‌ నుంచి అబుదాబీకి వెళ్తున్నాను. విమానంలో నిద్ర పోతున్న సమయంలో నా ముందు ఉండే టీవీ స్క్రీన్‌పైన ఓ వ్యక్తి ఓ సందేశంతో కూడిన నోట్‌ను అతికించారు. లేచి చూసే సరికి ఆ నోట్ కనిపించింది.

   నా ఎదురుగా లవ్ లెటర్

  నా ఎదురుగా లవ్ లెటర్

  ఏదో రాసినట్టు ఉండటం, ఆ పేపర్ ఏమై ఉంటుందా అనే అనుమానం రావడంతో తీసి చదివాను. వెంటనే నాకు ముచ్చెటమలు పట్టాయి. నీవు హాట్‌గా ఉన్నావు. నీవు సరే అంటే నేను రెడీ అని అందులో రాశారు. ఇంతకీ ఇది రాసింది ఎవరూ అని ఎయిర్‌హెస్టెస్‌ను అడుగగా ఆమె నవ్వూతూ అదోరకంగా చూసింది. మరోసారి ఆమెను అడుగటంతో నీకు ప్రపోజల్ పెట్టింది ఎవరో అనే విషయాన్ని నీవు నిజంగా తెలుసుకోవాలనుకొంటున్నావా అని అని ఎయిర్‌ హోస్టెస్ సమాధానం ఇచ్చింది.

   లవ్ ప్రపోజల్ చేసింది అమ్మాయి కాదు

  లవ్ ప్రపోజల్ చేసింది అమ్మాయి కాదు

  ఎయిర్ హోస్టెస్ అలా సమాధానంతో నాలో మరింత ఆసక్తి పెరిగింది. అవును అని సమాధానం ఇచ్చే సరికి నీకు లవ్ ప్రపోజల్ చేసింది అమ్మాయి కాదు.. అబ్బాయి అని జవాబివ్వడంతో నేను కంగుతిన్నాను. అక్కడే ఆ అబ్బాయి ఉండటంతో కొంత భయపడ్డాను. విమానం ఆగగానే చెకవుట్ కోసం అక్కడి నుంచి వేగంగా పరుగుతీసి తప్పించుకొన్నాను అని ఈ సరదా సంఘటనను అఖిల్ వివరించాడు.

  ఇమేజ్ డామేజ్ చేయవద్దు..

  ఇమేజ్ డామేజ్ చేయవద్దు..

  అఖిల్, కార్తీకేయ పాల్గొన్న నంబర్ వన్ యారీ కార్యక్రమంలో హీరో సుశాంత్ వచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. కాసేపు సరదాగా గడిపి వెళ్లిపోయాడు. ఈ కార్యక్రమంలో అఖిల్‌ను రానా, కార్తీకేయ బాగా ఆటపట్టించారు. ఈ సందర్భంగా నా ఇమేజ్ డామేజ్ చేయవద్దని అఖిల్ వారిద్దరిని కోరాడు. మొత్తానికి అర్ధగంట నిడివి ఉన్న కార్యక్రమం చాలా ఆసక్తికరంగా సాగి ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.

  English summary
  Rajamouli son Kartikeya, Akhil Akkineni participated in Rana Daggubati's Number 1 Yaari. They have lot fun in this show and shared some interesting incidents in their life. In this juncture Akhil revealed that he got love proposal from one guy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X