»   » అఖిల్-వినాయక్ మూవీ టైటిల్ ఏమిటి?

అఖిల్-వినాయక్ మూవీ టైటిల్ ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున తనయుడు అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయక్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ప్రకటించలేదు. గతంలో ‘మిస్సైల్' అనే టైటిల్ వినిపించింది. తాజాగా ‘తాండవం' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. అయితే ఈ రెండింటిలో ఏదైనా ఫిక్స్ చేస్తారా? లేక మరో కొత్త టైటిల్ ఏదైనా ఖరారు చేస్తారా? అనేది ఆగస్టు 29న తేలనుంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ప్రకటిస్తారని అంటున్నారు.

అఖిల్ తెరంగ్రేటం చేస్తున్న సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 4 నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 20న ఎఎన్ఆర్ జయంతి సందర్భంగా ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. దసర కానుకగా అక్టోబర్ 21న సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ నుండి అంతా క్లాస్ హీరోలగానే పేరు తెచ్చుకున్నారు. అయితే అఖిల్ మాత్రం అందుకు భిన్నంగా మాస్ ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తొలి సినిమాతోనే మాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.

Akhil Akkineni's film title Taandavam?

తొలి సినిమాలో అఖిల్ డాన్స్ మూమెంట్స్, ఫైట్ సీక్వెన్స్ హైలెట్ అయ్యేలా చిత్రీకరణ జరుగుతోంది. దీంతో పాటు సినిమాలో లిప్ లాక్ ముద్దు సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. తొలి సినిమాలోనే అఖిల్ ఈ రేంజిలో రెచ్చిపోవడం చర్చనీయాంశం అయింది.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Film makers are planning to release the Akhil Akkineni's film first look in a grand way on King Nagarjuna's birthday on Aug 29th. In the meantime speculation is increasing on film's title. It is coming out filmmakers are considering Taandavam. Earlier they considered Misslie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu