Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్టార్ దర్శకుడితో అఖిల్ అక్కినేని.. కొత్త ప్రాజెక్టు మొదలయ్యేది ఎప్పుడంటే?
యువ హీరో అఖిల్ అక్కినేని మొదటి సక్సెస్ కోసం ఎంతగా ఏదురుచూస్తున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వరుసగా మూడు డిఫరెంట్ సినిమాలతో వచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన అఖిల్ నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో మాత్రం బాక్సాఫీస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఆ సినిమాపై అభిమానుల అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ డిఫరెంట్ లవ్ స్టొరీ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం. అయితే ఆ సినిమా అనంతరం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబో పై అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదటి సినిమా అఖిల్ తరువాత ఇంతవరకు ఈ అక్కినేని వారసుడు ఫుల్ యాక్షన్ మోడ్ లోకి రాలేదు.

కానీ ఈ సినిమాతో మాత్రం నెవర్ బిఫోర్ అనేలా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలడని తెలుస్తోంది. కిక్ రేసుగుర్రం వంటి సినిమాలతో కమర్షియల్ దర్శకుడిగా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న సురేందర్ రెడ్డి సైరా సినిమాతో కూడా పర్వలేదనిపించాడు.
కానీ ఆ పాన్ ఇండియా సినిమా అనుకున్నంత స్థాయిలో అంచనాలను అందుకోలేదు. ఇక అఖిల్ తో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి మూడవ వారంలో మొదలు కానుందట. ఇప్పటికే హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్న అఖిల్ ఈ సినిమాతో సక్సెస్ అందుకోవడం కాయమని టాక్.