For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఖిల్ అక్కినేని రెస్పాన్స్ కు థ్రిల్ అయ్యి...

  By Srikanya
  |

  హైదరాబాద్: ఒక్క సినిమా కూడా బయిటకు రాకుండా సినీ వర్గాల్లోనే కాక బయిట కూడా క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరూ అంటే అక్కినేని అఖిల్ అనే చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు గారి మరో నట వారసుడు అయిన అఖిల్...రీసెంట్ గా టైటాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఓ యాడ్ చేసాడు. ఈ యాడ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది చాలా థ్రిల్లయ్యాడు అఖిల్. ఈ మేరకు తన ఆనందాన్ని ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నాడు.

  అఖిల్ ట్వీట్ చేస్తూ...‘నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మరియు నన్ను ఇంతలా మెచ్చుకుంటున్నందుకు నా ధన్యవాదాలు. మీ ఎంకరేజ్ మెంట్ కి నేను కేవలం ఒక థాంక్స్ చెప్తే సరిపోదు.. లవ్ యు ఆల్' అన్నాడు.

  Akhil akkineni Very happy with Ad

  ఇక అఖిల్ త్వరలో నటించనున్న మొదటి సినిమా ప్రారంభం అవనుంది. ప్రస్తుతం ఆ కథని, దర్శకుడుని ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అఖిల్ హీరోగా లాంచ్ కాకముందే స్టార్ హీరోకి రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. దాంతో అతన్ని టైటాన్ వారు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవటం జరిగింది. ఇక అఖిల్ చిత్రం లాంచింగ్ విషయానికి వస్తే... మరో యంగ్ హీరో నితిన్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేస్తాడని వార్తలు వచ్చాయి కానీ అతను మహేష్ తో చేస్తాడున్నాడని తేలిపోయింది.

  అఖిల్ లాంచింగ్ గురించి నాగార్జున ఆ మధ్యన మాట్లాడుతూ... '' 'మనం'లో అఖిల్‌ని ముప్పై సెకన్లపాటు చూపించారు విక్రమ్‌. అది అభిమానులకు ఎంతగానో నచ్చింది. 'మనం'లో అఖిల్‌ కనిపించేది 30 సెకన్లే. అది చూసి అంచనాకు రాలేం. 30 సెకన్ల వాణిజ్యప్రకటనలో అందరూ అందంగానే కనిపిస్తారు. పూర్తిస్థాయి హీరోగా ఎలా రాణిస్తాడో చూడాలి అంటున్నారు నాగార్జున. ఆయన రెండో కుమారుడు అఖిల్ హీరోగా లాంచ్ కాబోయే చిత్రం పై అంతటా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నాగార్జున పుత్రోత్సాహంతో ఇలా స్పందించారు.

  అలాగే నవ్వుతూ... ''అఖిల్‌ మరో మహేష్‌ అవుతాడు.. అంటుంటే అంతకంటే ఆనందం ఉంటుందా? ఇంకొంతమంది చైతూకి పోటీ వస్తున్నాడా? అని అడుగుతున్నారు. చైతన్య సంగతి పక్కన పెట్టండి. అఖిల్‌కి పోటీగా నేనున్నాను కదా.? నన్ను దాటమనండి.అఖిల్‌కి తనపై తనకు నమ్మకం ఎక్కువ. చిన్నతనం నుంచి ఇలాగే కాన్ఫిడెన్స్‌గా ఉండేవాడు. అఖిల్‌ సినిమాకి నేనే నిర్మాత అని అన్నారు.

  English summary
  Akhil Akkineni tweeted: "Thank you so much everyone for all the love and appreciation. I can't thank you enough for how much you have encouraged me. Love to you all"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X