»   » అఖిల్ అక్కినేనితో కొణిదెల నిహారిక?

అఖిల్ అక్కినేనితో కొణిదెల నిహారిక?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని అఖిల్ తొలి సినిమా విషయంలో బోల్తా పడిన సంగతి తెలిసిందే. హిట్ హీరోగా అఖిల్ లాచింగ్ ఉంటుందని అంతా భావిస్తే.... ప్లాప్ హీరోగా లాంచ్ అయ్యాడు. అందుకే తన తర్వాతి సినిమా విషయంలో అఖిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సెకండ్ సినిమా విషయంలో అంతా పర్ ఫెక్టుగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

తన తర్వాతి సినిమాలో మెగా ఫ్యామిలీ హీరోయిన్ కొణిదెల నిహారిక అయితే బావుంటుందని భావిస్తున్నాడట. తమ ఇద్దరి మధ్య ఇప్పటికే మంచి పరిచయం ఉండటం, ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా కావడంతో ఆమెతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నాడట. ఇద్దరం కలిసి నటిస్తే సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాడట.

Akhil eye on Niharika

ప్రస్తుతం కొణిదెల నిహారిక...‘ఒక మనసు' అనే చిత్రంలో నటిస్తోంది. మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. నిహారిక హీరోయిన్ గా పరిచయం అవుతున్న తొలి సినిమా కూడా ఇదే.

హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

English summary
Akhil who's become cautious after AKHIL flop started working on his next already though everything is still under wraps. News is that Akhil asked makers to rope in Mega heroine Niharika opposite him for the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu