»   »  నమ్మక ద్రోహి నితిన్-కుట్రదారు వినాయక్!, నాగ్ వివరణ...

నమ్మక ద్రోహి నితిన్-కుట్రదారు వినాయక్!, నాగ్ వివరణ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దసరా సందర్భందా అక్టోబర్ 22న విడుదల కావాల్సిన ‘అఖిల్' సినిమా ఉన్నట్టుండి వాయిదా పడింది. దీంతో అక్కినేని అభిమానులు అగ్గిమీద గుగ్గిలంలా ఫైర్ అవుతున్నారు. దసరాకు సినిమాను విడుదల చేస్తానని చెప్పిన నితిన్ నమ్మక ద్రోహం చేసాడంటూ, వివి వినాయక్ కుట్రదారు అంటూ అభిమానులు ఆందోళన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో అభిమానులను కూల్ చేయడానికి శుక్రవారం సాయంత్రం నాగార్జున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. గ్రాఫిక్స్ సమస్య వల్లనే ‘అఖిల్' సినిమా వాయిదా వేయాల్సి వచ్చిందని, రాజమౌళి బాముబలి తర్వాత తెలుగు సినిమాలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఏర్పడింది. సినిమా అంతా బావుండి గ్రాఫిక్స్ బాగోలేక పోతే చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశ్యంతో సినిమా విడుదల వాయిదా వేసినట్లు తెలిపారు.

Akhil fans associations Protest

‘అఖిల్' సినిమా వాయిదా పడినందుకు అభిమానులకు ఎంత బాధగా ఉందో, అంతకంటే ఎక్కువ బాధ నాకూ ఉంది. కానీ రేపు సినిమా విడుదలైన తర్వాత అంతా హ్యాపీగా ఫీలవుతారు. అఖిల్ పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా డాన్స్ విషయంలో చాలా గొప్పగా చేసాడు. ఒకసారి అఖిల్ ఇంటికి వచ్చాక ఇంత డాన్స్ ఎప్పుడు నేర్చుకున్నావ్ అని అడిగాను. అఖిల్ నేను ఊహించిన లెవల్ కి మించి పోయాడు. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు అని నాగార్జున తెలిపారు.

సినిమా వాయిదా వేస్తున్నామనే విషయం తెలిసిన తర్వాత అఖిల్ కొంచెం ఫీల్ అయ్యాడు. కామ్ గా ఉన్నాడు. పబ్లిసిటీ ఇంకా బాగా ప్లాన్ చేసుకోవచ్చు అంటూ వెంటనే పాజిటివ్ మోడ్ లోకి వెళ్లి పోయాడు. గ్రాఫిక్స్ తాము అనుకున్న విధంగా వచ్చిన తర్వాత సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు నాగార్జున.

Akhil fans associations Protest

అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
This morning, Akhil fans associations in Nellore gathered on streets in huge numbers raising slogans against the film's producer Nithiin, calling him the mastermind behind the postponement.
Please Wait while comments are loading...