Just In
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా ప్రక్కన చేస్తున్నది ఈమే : అఖిల్ (అఫీషియల్)
హైదరాబాద్ : తన ప్రక్కన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయమే వస్తున్న ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేసారు అఖిల్. స్వయంగా ట్విట్టర్ లో ఆమె ఫొటో పెట్టి..ఈమేతోనే నేను త్వరలో చిత్రం చేయబోయేది అని అఫీషియల్ గా తెలియచేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
వూహ తెలియని వయసులోనే 'సిసింద్రీ'గా వినోదాలు పంచాడు అఖిల్ అక్కినేని. ఆయన వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. యువ కథానాయకుడు నితిన్ నిర్మిస్తున్న ఆ చిత్రం ఇటీవల లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. అఖిల్ సరసన నటించే హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ కొన్ని రోజులుగా అన్వేషణ జరుపుతోంది.

ఆ ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. హీరోయిన్ గా సాయేషా సైగల్‌ని ఎంపిక చేశారు. హిందీ నటుడు దిలీప్‌కుమార్ మనవరాలే సాయేషా. ప్లస్ టు చదువుతోంది. అజయ్ దేవగణ్‌తో 'శివాయ్'లో నటిస్తోంది. ఇప్పుడు అఖిల్‌తో నటించే అవకాశం దక్కించుకుంది. ''మా సినిమాలో సాయేషా సైగల్‌ను హీరోయిన్ గా ఎంపిక చేశాం. ఈ నెల 14న హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. 16 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ఉంటుంది''అని ట్వీట్ చేశాడు అఖిల్.
Excited to see all the fans on 14th. Having a big launch and we are all set to shoot from 16th. VINAYAK garu is very confident and so am I
— Akhil Akkineni (@AkhilAkkineni8) February 10, 2015
ఆ మధ్య ఈ చిత్రాన్ని మామూలు పూజా కార్యక్రమాలతో అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న శిల్ప కళా వేదకలో భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి అఖిల్ ను అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి గ్రాండ్ అతన్ని హీరోగా లాంచ్ చేయబోతున్నారు.
ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్, సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే షూటింగ్ మొదలు కానుంది. . ఫైట్ సీన్లతో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. వినాయక్ పోకడ చూస్తుంటే అఖిల్‌ను పూర్తి మాస్ హీరోగా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అక్కినేని అఖిల్ లాంచింగ్ కోసం అక్కినేని కుటుంబ అభిమానులే కాకుండా తెలుగు సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. అందుకే తొలి చిత్రం ప్రయోగాల జోలికి పోకుండా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు.
వినాయక్ శైలి యాక్షన్, వినోదం మేళవింపుతో రూపొందనున్న ఈ చిత్రంలో అఖిల్ పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండనుంది. షూటింగ్ త్వరత గతిన పూర్తి చేసి వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు.