»   » నేనే స్వయంగా చెప్పినా గాసిప్స్ ఎందుకు?: నాగార్జున

నేనే స్వయంగా చెప్పినా గాసిప్స్ ఎందుకు?: నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu
Akkineni Akhil
హైదరాబాద్ :అప్పుడు...ఇప్పుడూ అదే అంటాను. నటించట్లేదని. అఖిల్ నటించట్లేదని నేనే స్వయంగా చెప్పినా గాసిప్స్ ఎందుకు రాస్తారో అర్థం కావట్లేదు. అఖిల్‌ని వచ్చే ఏడాది పరిచయం చేస్తాం. డైరక్టర్ ఎవరు? ఏమిటి?.. ఆ విశేషాలన్నీ సవివరంగా వెల్లడిస్తాం. 'మనం'లో మాత్రం అఖిల్ నటించట్లేదు అని మరోసారి నాగార్జున అఖిల్ ఎంట్రీ గురించి..మనం లో నటించే విషయం గురించి మీడియాకు తేల్చి చెప్పారు.'మనం' చిత్రంలో అఖిల్ నటించరని గతంలో మీరన్నారు. కానీ నటిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పుడేమంటారు? అని మీడియావారు ప్రశ్నిస్తే ఇలా స్పందించారు.

'మనం' షూటింగ్ షెడ్యూల్ డిటేల్స్ చెప్తూ...చిత్రం షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. మైసూరు పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నాం. మా కథలో భాగంగా కొన్ని జమీందారి ఇళ్లు కావాల్సి వచ్చింది. వాటికోసం, ఇతరత్రా లొకేషన్ల కోసం ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్ పూర్తయితే , మరో 5-6రోజుల వర్క్ ఉంటుందంతే. అటు నాన్నగారితో, ఇటు చైతూతో కలిసి వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ . ప్రస్తుతం పూర్తి ఏకాగ్రత 'మనం' మీదే ఉంది. ఇంకే సినిమాలనూ ఒప్పుకోలేదు. ఫైనల్ కాగానే ప్రకటిస్తాను అన్నారు.


ఈ చిత్రంలో నాన్నగారి పార్ట్ పూర్తయింది. నాన్నగారు ఆ మధ్య మేజర్ సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేశారు. ఆయన డెడికేషన్, విల్‌పవర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నాన్నగారు ప్రస్తుతం బావున్నారు అని చెప్పారు. తమ సంస్ధ చిత్రాలు గురించి చెప్తూ...అన్నపూర్ణ సంస్థలో వరుసగా సినిమాలు చేస్తున్నాం. ఇప్పుడు 'మనం' శరవేగంగా జరుగుతోంది. మొన్న విజయ్‌కుమార్ కొండా, నాగచైతన్య కాంబినేషన్‌లో సినిమా మొదలైంది. సురేష్‌బాబు, రామ్మోహన్‌తో కలిసి 'ఉయ్యాల జంపాల'ను తెరకెక్కిస్తున్నాం అన్నారు.


'ఉయ్యాల జంపాల' గురించి చెప్తూ... ఈ సినిమా గురించి 'అష్టాచమ్మా,' 'గోల్కొండ హైస్కూల్' చిత్రాల నిర్మాత రామ్మోహన్ నాతో ప్రస్తావించారు. కథ వినగానే చాలా బాగా నచ్చింది. నేటి యువతకు గ్రామాలతో పెద్దగా సంబంధం ఉండట్లేదు. మేం పల్లెటూరి సినిమాలు చేసినప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా తేడాలొచ్చాయి. ఇప్పుడు గ్రామీణ యువతకు ఫేస్‌బుక్ నుంచి సెల్‌ఫోన్, చాటింగ్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ప్రేమకథల్లో కొత్తదనం నిండి ఉంటుంది. 'ఉయ్యాల జంపాల' గురించి ఒక్కమాటలో చెప్పమంటే అమాయకత్వం, ఆధునికత కలిసిన సినిమా. హీరో, హీరోయిన్ నుంచి చాలా మంది కొత్తవారు పనిచేశారు. సురేష్‌బాబుగారు ఈ సినిమాతో అసోసియేట్ కావడం మరో ఆనందం అన్నారు.

English summary
Nagarjuna's younger son, Akkineni akhil will make his debut to tollywood as a hero next year. Prior to his debut film as a hero, akhil has been gossiped to be seen in a guest role in Akkinenis' multi-starrrer 'Manam'. When asked about this news to Nagarjuna, he rubbished the rumours and made it clear that akhil would debut next year for sure, as a hero. Dr. Akkineni Nageswara Rao, Nagarjuna and Naga Chaitanya will be seen as the lead star cast of 'Manam'. Samantha is teaming up with Naga Chaitanya in this film. Shriya shares the screen space with Nagarjuna. Anup Rubens scores the music of the movie.Vikram Kumar is directing this movie on Annapurna Studios.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu