»   » సారీ చెప్పిన నితిన్: దసరాకు ‘అఖిల్’ రావడం లేదు

సారీ చెప్పిన నితిన్: దసరాకు ‘అఖిల్’ రావడం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అఖిల్'. యువ హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల చేద్దామనుకున్నారు. అయితే గ్రాఫిక్స్ వర్క్ కాక పోవడంతో సినిమా విడుదల వాయిదా వేసారు. ఈ మేరకు నితిన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు.


ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఔట్ పుట్ చూసిన నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘అఖిల్' మూవీని సోషియో ఫాంటసీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో భారీగానే గ్రాఫిక్స్ ఉన్నాయట. సినిమాను అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తి చేసుకున్నా గ్రాఫిక్స్ మాత్రం కావాల్సిన విధంగా రాలేదని అంటున్నారు. దీంతో నాగార్జున, దర్శకుడు వివినాయక్ గ్రాఫిక్స్ విషయంలో మార్పులు చేయాలనుకుంటున్నారట.


అయితే నిర్మాత నితిన్ మాత్రం.... సినిమాను దసరకే విడుదల చేయాలని పట్టుబడుతూ వచ్చారు. డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను దసరాకే విడుదల చేయాలని నితిన్ మీదన ప్రెషర్ పెంచినట్లు తెలుస్తోంది. ఒక వేళ సినిమాను దసరాకు విడుదల చేయకుంటే.... ముందుగా మాట్లాడుకున్న అమౌంట్లో కేవలం 70శాతం మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో నితిన్ ఆందోళనగా ఉన్నాడట. అయితే డబ్బు కోసం తన కొడుకు భవిష్యత్తును పనంగా పెట్టలేనని నాగార్జున తేల్చి చెప్పడంతో.... నితిన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. మరి డిస్ట్రిబ్యూటర్లను నితిన్ ఎలా మేనేజ్ చేసాడో? ఏంటో?


AKHIL out of Dussera race

అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.


ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.


English summary
"Due to delay in graphics work v r unable to release AKHIL on oct22nd..sorry for the delay..will announce the new release date soon..sorry" Nitin said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu