»   » చెయ్-శామ్..రెండు ఎంగేజ్మెంట్స్, చీర పై ప్రేమకథ, అఖిల్,రానా ఏమంటాడంటే

చెయ్-శామ్..రెండు ఎంగేజ్మెంట్స్, చీర పై ప్రేమకథ, అఖిల్,రానా ఏమంటాడంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత నిశ్చితార్థం హైదరాబాద్‌ ఎన్‌కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. అతిథుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

  'మా అమ్మ నాకూతురైంది' అంటూ నిశ్చితార్థ వేడక ఫోటోలను నాగార్జున ట్విటర్‌లో పోస్టు చేశారు. నాగచైతన్య, సమంత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరి వివాహానికి ఇరు వైపులా పెద్దలు అంగీకరించడంతో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

  'ఏ మాయ చేసావే' సినిమాతో వెండితెరను పంచుకున్న నాగచైతన్య, సమంత ఇప్పుడు జీవితాన్ని పంచుకోనున్నారు.అయితే.. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. వీళ్లిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావటంతో రెండు నిశ్చితార్దాలు చేసారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఈ నిశ్చితార్దం జరిగింది.

  నాగచైతన్య, సమంత నిశ్చితార్థ వేడుక కోసం చేసిన అలంకరణ 'ఏమాయ చేసావె' చిత్రంలోని క్లైమాక్స్ సీన్ ని, వారిద్దరూ ఆ చిత్రంలోని కార్తీక్‌, జెస్సీ పాత్రల్ని గుర్తుకు తెప్పించడం విశేషం. అందుకు సంభందించిన ఫొటోలు మీరు ఇక్కడ గమనించవచ్చు.

  అందరిలోనూ ఇదే విషమయై ఆసక్తి

  అందరిలోనూ ఇదే విషమయై ఆసక్తి

  నాగ చైతన్య హిందూ సాంప్రదాయాలను పాటించే టాలీవుడ్ హీరో. సమంత క్రిస్టియానిటీని నమ్మిన హీరోయిన్. మరి వీరిద్దరి ప్రేమ అంటే ఓకే.. మరి నిశ్చితార్దం.. వివాహం... ఏ రకంగా జరుగుతాయనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీనికి నిశ్చితార్ధం రోజున ఓ సమాధానం దొరికేసింది. ఒకే నిశ్చితార్ధ వేడుకలో.. ఇటు హిందూ సంప్రదాయాలతో పాటు అటు క్రైస్తవ పద్ధతులతో సహా ఎంగేజ్మెంట్ జరగడం విశేషం.

  హోమం చేసింది..

  హోమం చేసింది..

  చర్చ్ ఫాదర్ ఇద్దరి నిశ్చితార్ధాన్ని దగ్గరుండి జరిపించగా.. ఆ తర్వాత హిందూ సంప్రదాయాల ప్రకారం బొట్టు పెట్టించుకుని మరీ హోమం చేసేసింది సమంత. మొదట నాగ్ కొన్ని పొటోలు మాత్రమే షేర్ చేసారు. తర్వాత మిగతా ఫొటోలు బయిటకు వచ్చాయి.

  మొదట క్రిష్టియన్ పద్దతిలో ...

  మొదట క్రిష్టియన్ పద్దతిలో ...

  మరి కొన్ని నెలల్లో జరగనున్న పెళ్లి కూడా ఇలాగే రెండు రకాలుగా జరగనుందనే తెలుస్తోంది. మొదట చెన్నైలో క్రిస్టియన్ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత హిందూ ట్రెడిషన్స్ ప్రకారం పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.

  మనం గుర్తు చేస్తూ...

  మనం గుర్తు చేస్తూ...

  కాబోయే దంపతులు, అమల, అఖిల్‌, అతని కాబోయే భార్య శ్రియా భూపాల్‌లతో కలిసి తీయించుకున్న ఫొటోను నాగార్జున తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘మనం' సినిమా పాత్రలను గుర్తు చేస్తూ ‘‘ఇప్పుడిది అధికారికం. మా అమ్మే నా కూతురు. ఇంతకు మించిన ఆనందమే ముంది! నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను'' అన్నారు.

  పరిచయం, ప్రేమగా..

  పరిచయం, ప్రేమగా..

  చైతన్యతో కలిసి నటించిన ‘ఏమాయ చేశావే' చిత్రం ద్వారానే సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. కొంతకాలంగా వీరి ప్రేమ పెళ్లిపై మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు.

  శ్రియా భూపాల్ తో ..

  శ్రియా భూపాల్ తో ..

  వీరికంటే ముందే నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థం జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాగార్జున తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటూ ఉబ్బితబ్బిబ్బయ్యారు.

  ఇటలీలో..తమ్ముడు

  ఇటలీలో..తమ్ముడు

  ఈ ఏడాదే చైతన్య, అఖిల్‌ వివాహాలు చేసేందుకు నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. అఖిల్‌ పెళ్లి ఇటలీలో, తన పెళ్లి హైదరాబాద్‌లో జరుగుతుందని చైతన్య ఇదివరకే తెలిపాడు.

  సమంత కట్టుకున్న చీరపై

  సమంత కట్టుకున్న చీరపై

  ఈ నిశ్చితార్థ వేడుక కోసం సమంత కట్టుకున్న చీరకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే... చై, తన ప్రేమకథను బొమ్మల రూపంలో చీరపై సమంత డిజైన్‌ చేయించింది. మీరు ఇప్పుడు ఆ చీరను గమనిస్తే మీకు అర్దం అవుతుంది.

  రింగ్ తొడగగానే..

  రింగ్ తొడగగానే..

  సమంత క్రిస్టియన్‌ కాబట్టి... క్రైస్తవ సంప్రదాయంలోనూ, ఇటు అక్కినేని కుటుంబానికి తగ్గట్టు హిందూ సంప్రదాయంలోనూ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. కాబోయే భార్యకు చైతన్య ఉంగరం తొడిగి, ఆత్మీయంగా ముద్దాడారు. నవ్వుల్లో మునిగిన సమంత మురిసిపోయింది.

  టాలీవుడ్ నుంచే కాదు ..

  టాలీవుడ్ నుంచే కాదు ..

  టాలీవుడ్ అందమైన జంటగా అభిమానులు యాక్సెప్ట్ చేసిన లవ్లీ కపుల్ నాగచైతన్య, సమంత నిశ్చితార్థం ఘనంగా పూర్తైంది. ఈ మేరకు టాలీవుడ్ లో చాలా మంది తమ విషెష్ తెలిపారు. తమ అభిమాన జంటకు నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ అయిందన్నవార్తల అటు అభిమానులను, ఇటు ఫిలింనగర్ ను మురిపిస్తోంది.

  అఖిల్ కు ముందు

  అఖిల్ కు ముందు

  'నా కంటే ముందు అఖిల్‌ పెళ్లి జరగడం హ్యాపీ. (నవ్వుతూ..) అందరి దృష్టి అఖిల్‌పై ఉంటుంది కదా! ఆ తర్వాత నేను హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. ఇండియాలోనే పెళ్లి చేసుకుంటా. అయితే.. అది చెన్నైలోనా? హైదరాబాద్‌లోనా? అనడిగితే చెప్పలేను'' అని 'సాహసం శ్వాసగా సాగిపో' రిలీజ్‌ టైమ్‌లో నాగచైతన్య చెప్పారు.

  సింపుల్ గా..

  సింపుల్ గా..

  చైతూ, సమంతలు సింపుల్‌గా ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట. కానీ, విదేశాల్లో కుమారుడి పెళ్లి ఘనంగా జరిపించాలని నాగార్జున కోరుకుంటున్నారట! అఖిల్‌-శ్రియాల పెళ్లి ఇటలీలో జరగనుందనే విషయం తెలిసింది. అదే విధంగా చైతూ కూడా విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకుంటే బాగుంటుందని నాగార్జున కోరిక అని సమాచారం. ముఖ్యంగా అఖిల్‌ పెళ్లి కంటే ముందే చైతూ పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారట.

  తక్కువ మంది మధ్యే ప్లాన్

  తక్కువ మంది మధ్యే ప్లాన్

  అఖిల్‌ది 'డెస్టినేషన్‌ మ్యారేజ్‌' . అది కూడా చాలా తక్కుమంది మధ్యనే ప్లాన్‌ చేశాం. ఓ 150 మంది ఉంటారు. ఎలాగూ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తాం. అందుకే వెడ్డింగ్‌ని తక్కువ మంది మధ్య చేయాలనుకున్నాం. పెళ్లనేది ఓ అద్భుతమైన ఘట్టం. ఆ మూమెంట్‌ని ఆస్వాదించాలనుకుంటున్నా అన్నారు నాగార్జున.

  చైతూ పెద్దవాడయ్యాడు..

  చైతన్య, సమంతల నిశ్చితార్ధంపై దగ్గుబాటి రానా స్పందించారు. తన కజిన్ అక్కినేని చైతన్య పెద్దవాడయ్యాడంటూ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. తమ కుటుంబంలోకి సమంతకు ఆహ్వానమంటూ ట్వీట్ చేశారు. చైతన్య, సమంతల నిశ్చితార్ధం ఫొటో కూడా జత చేశారు.

  హ్యాపీయిస్ట్ తమ్ముడు

  ''నాకో బ్రదర్‌.. నా కొత్త సిస్టర్‌. ఈ ప్రపంచంలో అత్యంత ఆనందమైన తమ్ముణ్ణి నేను'' అని అఖిల్‌ ట్వీట్‌ చేశారు.

  English summary
  After being in a relationship for last few months, the Naga Chaitanya-Samantha couple exchanged the rings. Whereas Akhil reposted his dad's tweeted by captioning, "My brother and my new sister ! I'm the happiest thammudu in the world. Love you guys !
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more