For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘అఖిల్’ ఎంట్రీ ఇక వచ్చే సంవత్సరమే...

By Bojja Kumar
|

హైదరాబాద్: అఖిల్ అక్కినేని తెరంగ్రేటం చేస్తున్న ‘అఖిల్' మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.... పలు కారణాలతో వాయిదా పడింది. దసరా సీజన్ ముగిసింది. కనీసం దీపావళికి అయినా ‘అఖిల్' సినిమా వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే ఇప్పటి వరకు యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి ప్రకటన లేక పోవడంతో దీపావళికి కూడా అఖిల్ రావడం లేదని తేలిపోయింది.

దీపావళి సీజన్ ముగిసిందంటే ఇక డిసెంబర్లోనే విడుదల వీలవుతుంది. డిసెంబర్ నెల తెలుగు సినిమాలకు పెద్దగా అచ్చిరాదు. కాబట్టి అఖిల్ సినిమా అపుడు విడుదల చేసే అవకాశం లేదు. కొత్త సంవత్సరంలో సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నా... అపుడు మహేష్ బాబు, బాలయ్య లాంటి పెద్ద హీరోల సినిమాలు ఉండటంతో వీరితో పోటీ పడి విడుదల చేయడం సాహసమే. మరి ‘అఖల్' విడుదలపై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అఖిల్ సినిమా ఈ సంవత్సరం విడుదల కావడం లేదనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.

Akhil Release Pushed To Next Year

దసరా సందర్భంగా అక్టోబర్ 22న విడుదల కావాల్సిన ‘అఖిల్' సినిమా ఉన్నట్టుండి వాయిదా పడటంతో అభిమానులు అగ్గిమీద గుగ్గిలంలా ఫైర్ అయ్యారు. దసరాకు సినిమాను విడుదల చేస్తానని చెప్పిన నితిన్ నమ్మక ద్రోహం చేసాడంటూ, వివి వినాయక్ కుట్రదారు అంటూ అభిమానులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.

దీంతో వెంటనే నాగార్జున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. గ్రాఫిక్స్ సమస్య వల్లనే ‘అఖిల్' సినిమా వాయిదా వేయాల్సి వచ్చిందని, రాజమౌళి బాముబలి తర్వాత తెలుగు సినిమాలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఏర్పడింది. సినిమా అంతా బావుండి గ్రాఫిక్స్ బాగోలేక పోతే చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశ్యంతో సినిమా విడుదల వాయిదా వేసినట్లు చెప్పి.... తాత్కాలికంగా అభిమానులను శాంతింప చేసారు. మరి మరోసారి అభిమానులు ఫైర్ అయితే నాగార్జున వారికి ఏం సమాధానం చెబుతారో?

Akhil Release Pushed To Next Year

అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
It is known that Producer Nithin, director V V Vinayak along with Nagarjuna had to face the ire of Akkineni fans, for postponing Akkineni Akhil's debut film Akhil. After promoting the film aggressively, makers of the film backed out of the Dusshera race as they are not satisfied with the output of CG work involved in the film. The team held a press meet and requested little patience from fans.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more