»   » నా వల్ల కాదు, తప్పుకుంటా: నాగార్జునకు అఖిల్ లెటర్

నా వల్ల కాదు, తప్పుకుంటా: నాగార్జునకు అఖిల్ లెటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అయిన అఖిల్... భవిష్యత్తులో మంచి నటుడిగా ఎదుగుతాడు అనే నమ్మకం కల్గించాడు. అతని తొలి సినిమా ‘అఖిల్' బాక్సాఫీసు వద్ద కాస్త నిరాశ పరిచినా పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా, ఫైట్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసాడు అఖిల్. అ సినిమాలో అఖిల్ ఎంతో కసిగా నటించాడు. వాస్తవానికి సినిమాల్లోకి రావాలనే కసి అఖిల్ లో చాలా కాలం నుండే ఉందట. గతంలో జరిగిన ఓ సంఘటనను నాగార్జున ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

‘యూఎస్ఏలో అఖిల్ బిబిఎం చదువుతున్నాడు. 1 సంవత్సరం కోర్స్ పూర్తయింది. ఉన్నట్టుండి అఖిల్ నుండి భారీ లెటర్ వచ్చింది. అది చూసి అంతా షాకయ్యాం. నాకు యాక్టర్ అవ్వాలని ఉంది. ఈ చదువు నా వల్ల కాదు. ఐ వాంట్ టు క్విట్ అంటూ లేఖ రాసాడు. యాక్టర్ కావాలనే అఖిల్ కోరికను అంతా అంగీకరించాం. చదువు పూర్తి చేయాలని చెప్పాను. తర్వాత ఇండియాకి తిరిగి వచ్చాడు. యాక్టింగ్, డాన్సింగ్, ఫైటింగ్ అన్నింటిలో శిక్షణ తీసుకున్నాడు' అని నాగార్జున తెలిపారు.


Akhil's letter to Nagarjuna

అఖిల్ తర్వాతి సినిమా వివరాలు...
తన తొలి సినిమా భారీ స్ధాయిలో ఖర్చు పెట్టి అదే స్ధాయిలో రిలీజ్ చేసినప్పటికీ ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుని కాస్త డీలా పడ్డాడు అఖిల్. అయితే చిత్రంగా తొలి సినిమా రిలీజ్ కు ముందే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. దాంతో ఆ సినిమా ఫలితం తో సంబందం లేకుండా తన తదుపరి ప్రాజెక్టుల మీద దృష్టి పెడుతున్నాడు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాన్ని బట్టి.. కమర్షియల్ విలువలతో వచ్చిన 'అఖిల్' కు డివైడ్ టాక్ రావటంతో నెక్ట్స్ సినిమాకు సామాజిక సందేశాలతో ముందుకెళ్ళే దర్శకుడిని తీసుకున్నాడన్న తెలుస్తోంది.


ఆ దర్శకుడు మరెవరో కాదు... క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ). క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు. కంచె సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించిన క్రిష్, అఖిల్ సినిమాకు ఓ కథను రెడీ చేసి చెప్పబోతున్నట్లు సమాచారం. 2016 ప్రారంభంలో ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాను గతంలో నాగార్జున, నాగచైతన్యలతో సినిమాలు రూపొందించిన డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్నారు.

English summary
King Nagarjuna himself revealed about a long letter written to him by his younger son couple of years back. "At that time he's studying BBM in USA. After completing 1 year of course, he wrote to me in a 'big letter' that he can't study further because he want to become an actor. He said 'I want to quit studies'. We said yes." he said.
Please Wait while comments are loading...