»   » మహేష్ కి థ్యాంక్యూ చెప్తూ ట్వీట్

మహేష్ కి థ్యాంక్యూ చెప్తూ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :తన మొదటి సినిమా 'అఖిల్' ఆడియో లాంచ్ కు విచ్చేసినందుకు హీరో మహేష్ బాబు కు థ్యాంక్యూ అంటూ అఖిల్ ట్వీట్ చేశారు. ఆడియో లాంచ్ కు మహేష్ రావడం, తనలాంటి కొత్త నటుడిని ప్రోత్సహించడం అమేజింగ్ గా అనిపించిందని.. హర్షం వ్యక్తం చేశారు.


అలాగే అఖిల్ సినిమాకి సంబంధించి సహకారం అందించిన ఎస్.ఎస్.కార్తికేయ(రాజమౌళి తనయుడు) పట్ల కూడా తన అభిమానాన్ని అఖిల్ ట్వీట్ రూపంలో చాటారు.అలాగే తనను ఎంకరేజ్ చేసి, ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కూడా థ్యాంక్యూ చెప్తూ ట్వీట్ చేశారు.ఇక సినిమా రిలీజ్ కోసమే తన ఎదురుచూపులని, అక్టోబర్ 22వ తేదీన ఆ బిగ్ డే రానుందని చెప్పుకొచ్చారు. సెప్టంబర్ 24 నుంచి పూర్తి స్థాయిలో సినిమా ప్రమోషన్ ఉంటుందని అఖిల్ ట్విట్టర్ లో వెల్లడించారు.కాగా అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆదివారం 'అఖిల్' ఆడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.అక్కినేని అఖిల్‌ను హీరోగా వెండి తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'అఖిల్‌'. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు నితిన్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలను ఈ నెల 20న విడుదల చేసారు . ఈ సందర్బంగా ఈ చిత్రం ధియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్‌ రూబెన్స్‌, థమన్‌ సంయుక్తంగా ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.


అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ ''ప్రేక్షకుల్ని ఎలా సంతృప్తిపరచాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటా. నా సినిమా పాటల విడుదల వేడుక గురించి ఒక చిన్న మాట చెప్పాలని మహేష్‌ని అడిగా. వేడుకకి నేనే వస్తా అన్నారు. చాలా సంతోషమనిపించింది. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఒక గొప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తా అని చెప్పా. ఆ మాట నిజం చేయబోతున్నా. వినాయక్‌గారు ఇదివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అనూప్‌, తమన్‌లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నయ్య, నేను బయట పెద్దగా మాట్లాడుకోం. కానీ నా గురించి వేదికలపై చాలా బాగా చెబుతుంటాడు. ఆ మాటల్ని చాలా ఇష్టపడుతుంటా'' అన్నారు.


వి.వి.వినాయక్‌ చెబుతూ ''ఒక సూపర్‌హిట్‌ సినిమా ఇస్తానని నాగార్జునగారికి మాటిచ్చా. ఆ మాటని నిలబెట్టుకోబోతున్నాం. సినిమా తీసినవాడిగా నేను చెబుతున్నా అఖిల్‌ తప్పకుండా సూపర్‌స్టార్‌ అవుతాడ''న్నారు.


Akhil says thanks to Mahesh

యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.


శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.


English summary
Akhil Akkineni tweeted:"A special thanks to urstrulyMahesh it was amazing to see him come and encourage a new comer like me. Thank you very much"
Please Wait while comments are loading...