»   »  అఖిల్ కొత్త సినిమా ఆలస్యానికి భారీ బడ్జెట్టే కారణమా..?

అఖిల్ కొత్త సినిమా ఆలస్యానికి భారీ బడ్జెట్టే కారణమా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని వంశ వారసత్వాన్ని అందిపుచ్చుకొని తాజాగా మూడో తరంనుంచి అక్కినేని అఖిల్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 'అఖిల్' పేరుతోనే వచ్చిన అఖిల్ మొదటి సినిమా హీరోగా అతడికి మంచి పేరే తెచ్చినా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది.

దీంతో తన రెండో సినిమా కోసం అఖిల్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు.అఖిల్ రెండవ సినిమా ఆలస్యం అవుతున్నా కొద్దీ, ఆయన అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన రెండవ సినిమా రానుందనీ, ప్రస్తుతం వంశీ పైడిపల్లి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడనే వార్త బయటికి వచ్చింది.

"ఊపిరి" సినిమాతో అక్కినేని నాగార్జునకు హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెట్టిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే అఖిల్ రెండో సినిమా ఉండనుందని సమాచారం. ఇదే విషయమై దర్శకుడు కూడా ఊపిరి ప్రమోషన్స్‌లో ప్రస్తావిస్తూ. అఖిల్ సినిమాకు సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, అన్నీ కుదిరాక ఈ విషయమై అధికారిక ప్రకటన ఉంటుందని తెలియజేశారు....

Akhil Second Movie Confirmed

ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ "ఏ జవానీ హై దీవానీ" కి రీమేక్ అని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఫిలిం నగర్లో వినిపిస్తున్న ఫ్రెష్ టాక్ ఏంటంటే వంశీ పైడిపల్లి "ఏ జవానీ హై దీవానీ" సినిమాను రీమేక్ చేయడంపై ఇంట్రెస్ట్ చూపలేదట. అఖిల్ కోసం కొత్త కథను రెడీ చేస్తున్నాడట.

అయితే ఈ కాంబినేషన్లో రానున్న సినిమా, నాగార్జునను కాస్త ఆలోచనలో పడేసిందనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం భారీ బడ్జెట్టేనట. ఈ సినిమాకి ఎంచుకున్న కథను బట్టి, దాదాపు 40 కోట్లు ఖర్చు కావొచ్చనే అభిప్రాయానికి వచ్చారట. ఇంచుమించు అదే బడ్జెట్ తో రూపొందిన 'అఖిల్' సినిమా నిరాశపరచిన సంగతి తెలిసిందే. అందువలన రెండవ సినిమాకి ఆ స్థాయిలో ఖర్చు చేయడం సాహసమే అవుతుంది. కథ చూస్తే బాగుంది ..

అదే బడ్జెట్ తో తీద్దామంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందువలన ఏం చేస్తే బాగుంటుందనే విషయం గురించి నాగార్జున ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు.

English summary
Akhil Second Movie With Vamshi Paidipalli is Confirmed, but getting late because of heavy budget
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu