»   » నితిన్ నా కాలర్ పట్టుకుని లాక్కెల్లాడు: అఖిల్ కామెంట్

నితిన్ నా కాలర్ పట్టుకుని లాక్కెల్లాడు: అఖిల్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని కుటుంబం నుండి హీరోగా పరిచయం అవుతున్న మరో యువ స్టార్ అఖిల్ అక్కినేని. ఆయన హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అఖిల్' చిత్రానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా యువ హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తునక్నారు.

ఈ చిత్రం ఆడియో వేడుక ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అఖిల్ స్పీచ్ ఆకట్టుకుంది. ఈ సినిమాను చేయాలని నితిన్ నా కాలర్ పట్టుకుని లాక్కెల్లాడు అంటూ అఖిల్ వ్యాఖ్యానించారు. మైండ్ దొబ్బిందా? ఈ సినిమా చెయ్యరా బాబు' అంటూ నితిన్ తన కాలర్ పట్టుకుని తీసుకెళ్లాడని అఖిల్ చెప్పాడు. నితిన్ లేకుండా నేను ఈ సినిమాలో లేను అని చెప్పుకొచ్చాడు.


Akhil speech at Akhil audio launch

వివి వినాయక్ నాకు చీకట్లో టార్చిలైట్ లా కనిపించారు. నన్ను కొడుకులా, ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తారు. నాతో మరో సినిమా చేస్తానని మాటిచ్చారు. అమోల్ రాథోడ్ నన్ను ఒక కొత్త యాంగిల్ లో చూపించారు. నాకోసం టెక్నీసియన్స్ అంతా కష్టపడ్డారు. అందరికీ థాంక్స్. సుధాకర్ రెడ్డిగారు నా వెనక ఉన్నారనే కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా చేసాను అన్నారు.


అమ్మా నాన్న, అన్నయ్యతో తొలి సినిమా ఆడియో రిలీజ్ చేయించాలనుకున్నాను. అది ఈ రోజు నిజమైంది. 'బైట్ ఇవ్వండి' అని మహేష్ బాబుగారిని అడిగితే, 'బైట్ దేముంది, నేనే వస్తానని భరోసా ఇచ్చారు. అలాగే వచ్చారు. నన్ను ప్రోత్సహించారు. ఆయన మంచితనానికి ధన్యవాదాలు అని అఖిల్ చెప్పుకొచ్చాడు.

English summary
Akhil Akkineni speech was interesting at his debut movie Akhil audio launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu