»   »  'అఖిల్‌' ...స్పెషల్ బెనిఫిట్ షో డిటేల్స్

'అఖిల్‌' ...స్పెషల్ బెనిఫిట్ షో డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'అఖిల్‌' చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 11 న అంటే రేపు విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం స్పెషల్ బెనిఫిట్ షో వేస్తున్నారు. మీకు బెనిఫిట్ షో చూడాలని ఉంటే ఆ డిటేల్స్ క్రింద ...

 AKHIL Spl Benefit Show at Mallikarjuna theatre

హైదరబాద్ కుకుట్ పల్లి... మల్లికార్జున ధియోటర్ లో నవంబర్ 11, ఉదయం 4:30 నిముషాలకు...
టిక్కెట్ల కోసం సంప్రదించాల్సిన నెంబర్: 8121843080


అక్కినేని 'అఖిల్‌' తెరంగేట్రం చేస్తున్న 'అఖిల్‌' చిత్ర సరికొత్త ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈనెల 11న దీపావళి కానుకగా 'అఖిల్‌' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువనటుడు నితిన్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ ట్రైలర్ ఇక్కడ చూడండి.నిర్మాత నితిన్‌ మాట్లాడుతూ ''అఖిల్‌ హీరోగా నటించిన తొలి చిత్రమిది. అందుకే సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటికి దీటుగా సినిమాని తెరకెక్కించారు దర్శకుడు. అఖిల్‌ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అనూప్‌ రూబెన్స్‌, తమన్‌ అందించిన గీతాలకి మంచి ఆదరణ లభించింది. సినిమా అదే తరహాలో ప్రేక్షకులకు చేరువవుతుంది. మా నిర్మాణ సంస్థకి మరపురాని చిత్రంగా 'అఖిల్‌' నిలుస్తుంది''అన్నారు.


 AKHIL Spl Benefit Show at Mallikarjuna theatre

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akhil Akkineni's AKHIL Spl Benefit Show at Mallikarjuna theatre Kphb On 11th Nov at 4:30Am
Please Wait while comments are loading...