»   » చాలా నేర్చుకోవాలి: హీరో నానిపై అఖిల్ ఊహించని కామెంట్

చాలా నేర్చుకోవాలి: హీరో నానిపై అఖిల్ ఊహించని కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో నాని విషయంలో అఖిల్ అక్కినేని ఎవరూ ఊహించని కామెంట్ చేశారు. తాజాగా విడుదలైన నాని 'నిన్న కోరి' మూవీ చూసిన అనంతరం అఖిల్ ఈ కామెంట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

సాధారణంగా ఇండస్ట్రీలోని నాలుగైదు స్టార్ ఫ్యామిలీస్ కు చెందిన హీరోలు.... తమ కంటే తక్కువ స్టార్ స్టేటస్ స్థాయి ఉన్న స్టార్స్ మీద పొగడ్తలు గుప్పించడం చాలా అరుదు. అందులోనూ మీ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనడం మనం ఎక్కడా కూడా వినిఉండం. కానీ అఖిల్ కామెంట్స్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.


నువ్వు హిట్ చిత్రాల మెషీన్

నువ్వు హిట్ చిత్రాల మెషీన్

‘నిన్న కోరి' సినిమా చూసిన అనంతరం అఖిల్ స్పందిస్తూ.... ‘కంగ్రాట్స్‌ నాని. నువ్వు హిట్‌ మెషిన్‌ అయిపోయావ్‌ మై బ్రదర్‌. నీ నుంచి నిజంగా చాలా నేర్చుకోవాలి.' అని ట్వీట్‌ చేశారు.


నిన్న కోరి

నిన్న కోరి

కేవలం అఖిల్ నుండి మాత్రమే కాదు... తెలుగు సిని సెలబ్రిటీలు, అభిమానులు ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని ఓ కొత్త పాయింటును టచ్ చేసిందని, అంటున్నారు. కలెక్షన్లు కూడా బావున్నయి. దీంతో నాని ఖాతాలో మరో హిట్ మూవీ పడ్డట్లయింది.


యూఎస్ఏలో సంచలనం...

యూఎస్ఏలో సంచలనం...

మరో వైపు ‘నిన్ను కోరి' చిత్రం యూఎస్ఏలో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేలోపు 1 మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.


నిన్ను కోరి

నిన్ను కోరి

నాని, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో ఆది పినిశెట్టి, మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ.



English summary
"Congratulations to the one and only NameisNani . You have become a hit machine my brother. So much to learn from you really ! We must chat" Akhil tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu