»   » అక్కినేని అఖిల్...మూవీ ఫస్ట్ లుక్ అదిరింది (ఫోటో)

అక్కినేని అఖిల్...మూవీ ఫస్ట్ లుక్ అదిరింది (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయక్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. అఖిల్ ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. సాయేషా సైగల్ అనే అమ్మాయిని హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ దిలీప్ కుమార్, అతని భార్య సైరా భానులకు రిలేటివ్ అయిన సాయేషా సైగల్ అఖిల్ సినిమా ద్వారా తెరంగ్రేటం చేయచోతోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకపై నిఖిత రెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్నారు. ఈ విషయమై నితిన్ స్పందిస్తూ....‘ప్రొడక్షన్ ఎ' లాంచ్ చేసాము. నిర్మాతగా ఇదే నా తొలి సినిమా. అఖిల్ నటిస్తున్న తొలి చిత్రం. మీ అందరి సపోర్టు కావాలి అని వెల్లడించారు.

 Akhil - vinayak's movie First Look posters

ఫైట్ సీన్లతో షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వినాయక్ పోకడ చూస్తుంటే అఖిల్‌ను పూర్తి మాస్ హీరోగా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అక్కినేని అఖిల్ లాంచింగ్ కోసం అక్కినేని కుటుంబ అభిమానులే కాకుండా తెలుగు సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. అందుకే తొలి చిత్రం ప్రయోగాల జోలికి పోకుండా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు.

 Akhil - vinayak's movie First Look posters

వినాయక్ శైలి యాక్షన్, వినోదం మేళవింపుతో రూపొందనున్న ఈ చిత్రంలో అఖిల్ పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండనుంది. షూటింగ్ త్వరత గతిన పూర్తి చేసి వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు.
English summary

 Akhil Akkineni is all set to make his debut as an actor in Tollywood and ‘Ishq’ star Nithiin has become the producer of this untitled film. The first look poster of Akhil is out and Nithiin said "Launching PRODUCTION A today..my 1st film as a producer,akhils debut film..need all ur support..wish us luck”. VV Vinayak is directing this romantic action entertainer and more details about this film will be out very soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu