For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హలో మూవీ ప్రివ్యూ: నాగార్జున కోరిక తీరేనా.. అఖిల్‌కు సక్సెస్ లభించేనా?

  By Rajababu
  |
  'హలో' లో అదే బిగ్ సర్‌ప్రైజ్ !

  ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో అక్కినేని నాగార్జున నిర్మాతగా రూపొందిన చిత్రం హలో. అక్కినేని నట వారసుడు అఖిల్ నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నది. అఖిల్ తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాఫ్ కావడంతో తన కుమారుడి మలి చిత్రాన్ని నాగార్జున చాలా సవాల్‌గా తీసుకొన్నాడు.

  అఖిల్‌కు బ్లాక్‌బస్టర్ ఇచ్చేందుకు మనం చిత్రాన్ని రూపొందించిన విక్రమ్ కే కుమార్‌తో జతకలిశాడు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి ప్రియదర్శన్ తెలుగుకు పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అని ఇటీవల వైజాగ్‌లో జరిగిన ఆడియో ఆవిష్కరణ సభలో నాగ్ ప్రకటించేశారు. నాగ్ అంతటి విశ్వాసంతో ఉండటానికి గల కారణాలేంటి అనే విషయాన్ని ఓ సారి పరిశీలిద్దాం.

  హలో స్టోరి ఇదే..

  హలో స్టోరి ఇదే..

  చిన్నతనంలోనే మంచి స్నేహితులైన అబ్బాయి, అమ్మాయి విడిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి ఓ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్తుంది. దాదాపు 15 సంవత్సరాలుపాటు హీరోయిన్‌కు హీరో ఫోన్ చేస్తుంటాడు. కానీ అమ్మాయి ఫోన్ ఎత్తదు. ఫోన్ నంబర్ ఇచ్చిన అమ్మాయి ఎందుకు ఫోన్ ఎత్తలేదు. అందుకు కారణాలు ఏమిటి. చివరకు తన స్నేహితురాలిని ఎలా కలుసుకొన్నాడు అనేది ఈ చిత్రకథ.

  విక్రమ్ కే కుమార్ డైరెక్షన్

  విక్రమ్ కే కుమార్ డైరెక్షన్

  దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన హలో చిత్రం ఓ విభిన్నమైన కథ. అనేక మలుపులు, అనుక్షణం ఉత్కంఠ కలిగించే విధంగా పక్కాగా స్క్రీన్ ప్లేను రూపొందించారని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రానికి యాక్షన్ పార్ట్ అదనపు ఆకర్షణ అవుతుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  అనూప్ ఫీల్ గుడ్ మ్యూజిక్

  అనూప్ ఫీల్ గుడ్ మ్యూజిక్

  సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఇప్పటికే సంగీత అభిమానులను ఆకట్టుకొన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా కుదిరింది. ఈ సినిమాను రీరికార్డింగ్ మరోస్థాయికి తీసుకెళ్తుంది అని నాగార్జున చెప్పారు. ఏవేవో క‌ల‌లు క‌న్నా..ఏ వైపో క‌దులుతున్నా...ఏమైందో తెలియ‌కున్నా..ఎన్నెన్నో జ‌రుగుతున్నా..` అనే పాటకు మంచి క్రేజ్ వచ్చింది

  పీఎస్ వినోద్ కెమెరా

  పీఎస్ వినోద్ కెమెరా

  ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీని అందించారు. అందమైన ప్రేమకథతోపాటు యాక్షన్ కథా చిత్రంగా రూపొందిన హలోలోని ప్రతీ సీన్‌ను అందంగా తీర్చిదిద్దారు. ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని అమల చెప్పింది.

  అఖిల్‌కు అమ్మానాన్నలుగా

  అఖిల్‌కు అమ్మానాన్నలుగా

  హలో చిత్రంలో అఖిల్‌కు తల్లిదండ్రులుగా జగపతిబాబు, రమ్యకృష్ణ నటించారు. ఒకప్పుడు హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ జంట అఖిల్‌కు అమ్మా, నాన్నగా నటించి అదరగొట్టారని చిత్ర యూనిట్ వెల్లడించింది. షార్ట్ హెయిర్ కట్‌లో రమ్యకృష్ణ లుక్ డిఫరెంట్‌గా ఉంది.

  40 కోట్ల బడ్జెట్‌‌తో

  40 కోట్ల బడ్జెట్‌‌తో

  భారీ అంచనాల మధ్య రీలీజ్ అవుతున్న హలో చిత్రాన్ని 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అన్ని అంశాల్లో సమతూకం ఉందనే అభిప్రాయంతో ఉన్న చిత్ర యూనిట్, నాగార్జున మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

  టీజర్లు, ఫస్ట్‌లుక్‌ మంచి రెస్పాన్స్

  టీజర్లు, ఫస్ట్‌లుక్‌ మంచి రెస్పాన్స్

  ఇప్పటికే రిలీజైన హలో టీజర్లు, ఫస్ట్ లుక్‌కు విశేష ఆదరణ లభించింది. యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఈ విధంగా వచ్చిన ప్రజాదరణ హలో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి.

  నటీనటులు, సాంకేతికవర్గం

  నటీనటులు, సాంకేతికవర్గం

  నటీనటులు : అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ , రమ్య కృష్ణ , జగపతిబాబు
  నిర్మాత: నాగార్జున అక్కినేని
  దర్శకత్వం: విక్రమ్ కే కుమార్
  సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్
  ఎడిటర్ : ప్రవీణ్ పూడి
  మ్యూజిక్ : అనూప్ రూబెన్స్
  రిలీజ్ డేట్: డిసెంబర్ 22, 2017

  English summary
  Akhil Akkineni’s debut film may have turned out to be a dud at the box office but the Akkineni fans haven’t written him off as yet. Akhils upcoming film Hello which is due for release on December 22, to cash in on the long Christmas weekend. This movie got good response to teaser and First look. Actor, Producer Nagarjuna relaunching Akhil with prestigiously.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X