twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకో ఇరవై రోజులు ఓపిక పట్టండి

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'మనం' సినిమా క్త్లెమాక్స్‌లో అక్కినేని అఖిల్ ని చూసి చప్పట్లు కొట్టిన వారు అతని తదుపరి చిత్రం కోసం ఎదురు చూస్తూండటం సహజమే. తెలుగు తెరకు ఐదుగురు హీరోలను అందించిన కుటుంబం నుంచి వస్తున్నా తనకంటూ ప్రత్యేకత ఉండాలనుకొని తొమ్మిది నెలలుగా కథ కోసం వెతుకుతున్నాడు. నటనలోనూ, పోరాటాల్లోనూ, డ్యాన్సుల్లోనూ ఆరితేరుతున్నాడు. మరో ఇరవై రోజుల్లో తన తొలి సినిమా కబుర్లు చెప్తాను అంటున్నాడు అఖిల్‌.

    అఖిల్ మాట్లాడుతూ... కథ పనులు చివరి దశకొచ్చాయి. ఇరవై రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాను. యాక్షన్‌, ప్రేమ, వినోదం.. ఇలా అన్ని రకాల అంశాలు మేళవించి పక్కా తెలుగు సినిమా సిద్ధం చేస్తున్నాం . మన సినిమాలను పరిశీలిస్తే ఎక్కువ భాగం డ్యాన్స్‌, ఫైట్స్‌, ప్రేమ అంశాలున్నవే కనిపిస్తాయి. ప్రేక్షకులకు నచ్చే ఇలాంటి వాణిజ్యపరమైన చిత్రంతోనే రావాలనుకుంటున్నాను. మొదట ప్రేక్షకులకు దగ్గరయ్యాకే వైవిధ్యమైన చిత్రాల వైపు వెళ్తాను అన్నారు.

    ఇక ఇప్పటికే నటనలో శిక్షణ పొందాను. థాయ్‌లాండ్‌లో తైక్వాండో శిక్షణ తీసుకున్నాను. రెండేళ్ల నుంచి డ్యాన్స్‌ తరగతుల్లో పాల్గొంటున్నాను. క్రికెట్‌ కూడా ఆడుతున్నాను. డ్యాన్స్‌, క్రికెట్‌ బాడీ స్వింగ్‌కు బాగా ఉపయోగపడతాయి. ఏం చేసినా పరిశ్రమలో అగ్రస్థానానికి చేరాలన్నదే నా కల. అందుకే కాస్త ఆలస్యమైనా అన్నింటా మేటిగా తయారై వస్తున్నాను అన్నారు.

    Akil Akkineni entry in 20 days

    అలాగే మనంలో హీరోగా అరంగేట్రం చేసేసిన విషయం చెప్తూ... ఇలా తొలి పరిచయం జరిగిన హీరో ఎవ్వరూ ఉండరేమో. సినిమాకు ట్రైలర్‌లా.. నా హీరో ఎంట్రీకి 'మనం'లో నా పాత్ర ఉపయోగపడింది. నేను తెరపై ఎలా కనిపిస్తాననేది తేలింది అన్నారు. ఆరు నెలల క్రితం దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ ఈ పాత్ర గురించి నాకు చెప్పారు. వెంటనే తాతగారి దగ్గరికెళ్లి అడిగితే 'కుటుంబం మొత్తం చేస్తున్న సినిమా ఒప్పేసుకో. మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో' అన్నారు. నాన్న అయితే ''ఆలోచించుకో.. నీ ఇష్టం'' అన్నారు. ఇప్పుడు నా పాత్రకు వస్తున్న స్పందన చూసి తాత పైనుంచి చాలా సంతోషిస్తుంటారు అన్నారు.

    తొలి షాట్‌ అనుభవం గురించి చెప్తూ... నా తొలి షాట్‌లోనే నేను నేరుగా వచ్చి తాతతో 'తాతగారూ... ఎలా ఉంది. అంతా ఓకేనా..' అని అడగటం. పక్కనేమో నాన్న, అన్నయ్య, శ్రియ, సమంత ఉన్నారు. వాళ్ల ముందు ఎలా మాట్లాడతానో అని భయంగానే చేశాను. రెండు టేక్‌ల వరకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అమ్మా, నాన్న తమ అనుభవాల్ని చెప్పారు. అంతేగానీ ఇలా ఉండు.. అలా ఉండు అని ఎవ్వరూ చెప్పలేదు.

    English summary
    Akkineni Akhil debut film will be launched on special date with in 20 days. There were numerous speculations about Akhil’s launch pad film and several star directors were considered for it. Akkineni Akhil underwent training in acting, fights, dances and other areas required for a star hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X