»   » ట్విట్టర్ ద్వారా ఖరారు చేసిన అఖిల్‌

ట్విట్టర్ ద్వారా ఖరారు చేసిన అఖిల్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రతీ విషయాన్ని ఇప్పుడు సెలబ్రేటీలు ట్వీట్స్ ద్వారా నే తమ అభిమానలకు తెలియచేస్తున్నారు. అది సినిమా అయినా మరొకటి అయినా...ఖండన అయినా..పొగడ్త అయినా ట్విట్టరే ప్రచార సాధనం. తాజాగా సీసీఎల్‌ (సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌) కి వైస్‌ కెప్టెన్‌గా అఖిల్‌ ఎంపికయ్యారు. ఆ విషయాన్ని అఖిల్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

''వెంకటేష్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు ఆనందంగా ఉంది''అని అఖిల్‌ ట్వీట్‌ చేశారు. స్టార్స్ మైదానంలోకి దిగి చెలరేగే సమయం వచ్చేసింది. సీసీఎల్‌ (సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌) నాలుగో సీజన్‌ 25 నుంచి మొదలవబోతోంది. ఎప్పట్లాగే ఈసారి కూడా తెలుగు వారియర్స్‌ జట్టుకి వెంకటేష్‌ నాయకత్వం వహించబోతున్నారు.

Akil Tweet about CCL

ఈ మ్యాచ్ కోసం తెలుగు వారియర్స్‌ జట్టు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. బరిలోకి దిగే నటులంతా రోజూ షూటింగ్‌ పూర్తవ్వగానే మైదానానికి చేరి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అఖిల్ ఇప్పటికే పలు సందర్భాల్లో క్రికెట్ ఆటలో తన ప్రతిభను కనబర్చి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో అఖిల్ ఒంటి చేత్తో జట్టును గట్టెక్కించాడు.

ఈ నేపథ్యంలో అఖిల్ కి వైస్ కెప్టెన్సీ అప్పగించడం ద్వారా మరింత మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నెల 25 నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ ఈసారి కూడా ఆసక్తికరంగా సాగబోతోంది. జట్లన్నీ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. ఈసారి తెలుగు జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ జట్టు ఆటగాళ్లు చెబుతున్నారు.

English summary
Akil tweeted: " Here goes! I'll be vice captaining the Telugu warriors under the one and only victory venkatesh!! #CCL4 Get ready !"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu