For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అకీరా మెగా ఫ్యామిలీ వారసుడే, వాడి రక్తంలోనే ఉంది: రేణు దేశాయ్

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ 'ఎ లవ్‌, అన్‌ కండీషనల్‌' అనే కవితల పుస్తకం రాశారు. దీన్ని ఇంగ్లీషులో రాసిన ఆమె తెలుగులో ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్‌ సహాయంతో అనువాదం చేసి విడుదల చేశారు. బుక్ ప్రమోషన్స్‌లో భాగంగా రేణు దేశాయ్ పలు తెలుగు టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు సైతం ఎదురయ్యాయి. పలు అంశాలపై రేణు దేశాయ్ తనదైన శైలిలో స్పందించారు.

  మెగా ఫ్యామిలీలో నా సొంత కొడుకు ఉన్నారు కదా...

  మెగా ఫ్యామిలీలో నా సొంత కొడుకు ఉన్నారు కదా...

  పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ దర్శకత్వం, నిర్మాణం, రచనలో తన ప్రతిభ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పికే రెండు చిత్రాలను ఆమె రూపొందించారు. తనకు దర్శకత్వం అంటే చాలా ఇష్టమని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే మెగా ఫ్యామిలీలో ఏ హీరోతో చేయాలని ఉంది? అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ ‘నా సొంత అబ్బాయి ఉన్నాడు కదా' అని రిప్లై ఇవ్వడం గమనార్హం.

  అకీరా గురించి ఇప్పుడే చెప్పలేను

  అకీరా గురించి ఇప్పుడే చెప్పలేను

  అకీరా యాక్టింగ్ వైపు వస్తాడా? లేక ఇతర రంగాల వైపు వెళతాడా? అనేది తాను ఇప్పుడే చెప్పలేను. కేవలం 14 సంవత్సరాల పిల్లాడు. చైల్డ్ హుడ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే అకీరాకు మ్యూజిక్ అంటే ఇష్టం. పియానా వాయిస్తాడు. ప్రతి ఒక్కరూ నన్ను అకీరాను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారా? అని అడుగుతున్నారు. వారికి చెప్పేది ఒకటే. నేనే ఏమీ చేయను. ఇప్పటి నుంచి అకీరా బ్రెయిన్లో యాక్టర్ కావాలనే ప్రెషర్ పెట్టడం నాకు ఇస్టం లేదని రేణు దేశాయ్ తెలిపారు.

  మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

  మెగా ఫ్యామిలీ రక్తం అకీరాలో ఉంది

  మెగా ఫ్యామిలీ రక్తం అకీరాలో ఉంది

  అకీరా మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా ఉండాలనే విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు. వాడి రక్తంలోనే అది ఉంది. పవన్ కళ్యాణ్ కొడుకు. చిరంజీవి పెద్దనాన్న. రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో అకీరాకు బ్రదర్ అని రేణు దేశాయ్ తెలిపారు.

  నాన్నతో పిల్లలు వెకేషన్ వెళ్లారు

  నాన్నతో పిల్లలు వెకేషన్ వెళ్లారు

  ప్రస్తుతం పిల్లలు వాళ్ల నాన్నతోనే విదేశాలకు క్రిస్మస్ వెకేషన్ వెళ్లారు. ప్రతి ఏడాది 10 రోజులు వారు తప్పకుండా కళ్యాణ్ గారితో వెకేషన్ వెళతారు. వారు ఇప్పుడు ఇండియాలో లేరు... ఫ్రీ టైమ్ ఉంది కాబట్టే నేను హైదరాబాద్ వచ్చి మీడియా ఛానల్స్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నట్లు రేణు దేశాయ్ తెలిపారు.

  పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా, మాట్లాడకున్నా ఇబ్బందే

  పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా, మాట్లాడకున్నా ఇబ్బందే

  పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద సెలబ్రిటీకి మాజీ భార్యను కావడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ఆయన గురించి ఏదైనా మాట్లాడితే...పబ్లిసిటీ కోసం మాట్లాడుతుంది అంటారు. మాట్లడకపోతే మరో రకంగా బ్లేమ్ చేస్తారు అని రేణు దేశాయ్ తెలిపారు.

  నా సొంత లవ్, పెయిన్ ఆ పుస్తకంలో

  నా సొంత లవ్, పెయిన్ ఆ పుస్తకంలో

  ‘ఎ లవ్‌, అన్‌ కండీషనల్‌' అనే పుస్తకంలోని కవితలు నేను స్వయంగా అనుభవించిన ప్రేమ, సంతోషం, బాధ లాంటి వాటికి ప్రతిరూపం. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి సంతోషాన్ని ఇస్తుంది, విడాకులు బాధను ఇస్తుంది. ఇలా ఎన్నో అంశాలు ప్రేమ, సంతోషం, బాధను కలిగిస్తాయని రేణు దేశాయ్ తెలిపారు.

  English summary
  "My son Akira is Mega Family kid, he is Pawan Kalyan son." says Renu Desai. "Was so happy when mainstream news channels took my interviews for the poetry book. And even more happier that the interviews were mainly related to poetry and not about my personal life...All of the interviews are being telecast on 1st January. The new year is going to start on a poetic note." Renu Desai said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more