»   » పవన్ కంటే అకీరా బెటర్ అంటూ వర్మ, రేణు థాంక్స్!

పవన్ కంటే అకీరా బెటర్ అంటూ వర్మ, రేణు థాంక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మీద రామ్ గోపాల్ వర్మ మరో పంచ్ వదిలాడు. ఆయన కొడుకు అకీరా నందన్ ను చూస్తుంటే అతని ఎదుగుదలతో పోలిస్తే పవన్ కంటే అకీరా 127 రెట్లు బెటర్' అంటూ కామెంట్ చేసారు. ఈ రోజు అకీరా నందన్ పుట్టినరోజు కావడంతో వర్మ ఈ వ్యాఖ్యలు చేసారు.

అకీరా పెరిగేకొద్ది 127రేట్లు పవన్ కంటే బెటర్ గా ఉంటాడు అంటూ వర్మ చేసిన ట్వీట్ పై రేణూదేశాయ్ స్పందిస్తూ..‘‘తల్లిదండ్రులైనా ఎవరైనా తమ పిల్లలు తమకంటే బాగా ఎదగాలని భగవంతుడిని ప్రార్ధిస్తారు. మీరు అకీరా గురించి ఇలా అనడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. థ్యాంక్యూ సార్'' అని ట్వీట్ చేసింది.

Akira Nandan 127 times better than Pawan Kalyan

ఇంతకీ వర్మ ఇలా ఎందుకన్నాడో తెలియదు కానీ అకీరాను అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీదకి పంచ్ విసిరాడనేది మాత్రం స్పష్టమవుతోంది. ఎన్నికల ముందు, పవన్ కళ్యాన్ జనసేన పార్టీ పెట్ట సమయంలో రామ్ గోపాల్ వర్మ ఇదే పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

నిన్న వర్మ తన పుట్టిరోజున కూడా సంచలన కామెంట్స్ చేసారు. ''పుట్టినరోజు అంటే ఒక రోజు గడిచిపోయినట్లే. అంటే చావుకి దగ్గర పడుతున్నట్లే. నేను చేసిన పాపాలకు నేనెప్పుడో చచ్చిపోయాను. నాకు మరుజన్మ ఉంటుందనే నమ్మకం లేదు. అందుకని, 'మెనీ హ్యాపీ రిటర్స్న్' అని చెప్పడం వృథా. అందరూ నా పుట్టినరోజుని కాదు.. మరణించిన రోజుని సెలబ్రేట్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది'' అంటూ ట్విట్టర్లో ట్వీటాడు వర్మ.

రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ చేయడంలో వింతేమీ లేదనుకోండి. అయితే తన చావు గురించి తనే ఇలా మాట్లాడుకోవడం చూసి పలువురు ఆశ్చర్య పోతున్నారు. కొందరరైతే ఆయనకు పిచ్చి పట్టి నట్లు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడే రామ్ గోపాల్ వర్మ..... తరచూ ఏదో వివాదాల్లో తలదూరుస్తూ ఉంటాడు. టింగరి పనులు చేస్తుంటారు. అందులో భాగంగానే తన బర్త్ డే సందర్బంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.

English summary
"Akira Nandan looks like he will be 127 times better than Pawan Kalyan when he grows up" RGV tweeted.
Please Wait while comments are loading...