»   »  అక్కినేని అఖిల్ డిక్లేర్ చేసేసాడు

అక్కినేని అఖిల్ డిక్లేర్ చేసేసాడు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : అక్కినేని అఖిల్ తాజాగా దృశ్యం చిత్రం చూసాడు. ఆ చిత్రం తనకు బాగా నచ్చిందని, ఖచ్చితంగా విజయం సాధిస్తుందని వెంటనే ట్వీట్ చేసాడు. దాంతో అక్కినేని అఖిల్ ని ఫాలో అవుతున్న యూత్ ద్వారా మరింతమందికి ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ చిత్రం టీమ్ కు, వెంకటేష్ , సురేష్ బాబులకు అభినందనలు తెలుపుతూ అఖిల్ ట్వీట్ చేసాడు.

  అఖిల్ ట్వీట్ లో... "దృశ్యం చిత్రం నిన్న చూసాను. సెకండాఫ్ అవుట్ స్టాండింగ్ గా ఉంది. స్క్ర్రీన్ ప్లే చాలా బాగా అల్లారు. టీమ్ కి అంతటికీ కంగ్రాట్స్. అలాగే వెంకటేష్ అంకుల్ కి, సురేష్ బాబు అంకుల్ కి అందరికీ పేరు పేరునా అభినందనలు. !". అన్నారు.

  Akkineni Akhil declares Drishyam as HIT

  మధ్యవయస్కుడైన తండ్రి, ఇద్దరమ్మాయిలు.. వీరి మధ్య నడిచే సినిమా 'దృశ్యం'. వెంకటేష్‌, మీనా జంటగా నటించారు. బేబీ ఎస్తర్‌, కృతిక, నదియా ముఖ్య పాత్రధారులు. శ్రీప్రియ దర్శకురాలు. రాజ్‌కుమార్‌థియేటర్స్‌, వైడ్‌యాంగిల్‌ క్రియేషన్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తండ్రీబిడ్డల మధ్య ఉండే మమకారం.. ప్రేమాభిమానాలకు వేదికగా నిలిచే చిత్రమిదని చిత్రబృందం చెబుతోంది.

  <blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Saw <a href="https://twitter.com/hashtag/Drishyam?src=hash">#Drishyam</a> yesterday. the 2nd half is outstanding. Very well layed out movie with an outstanding screenplay. Congrats to the team ! ATB</p>— Akhil Akkineni (@AkhilAkkineni8) <a href="https://twitter.com/AkhilAkkineni8/statuses/487133004125728768">July 10, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

  వెంకటేష్‌ మాట్లాడుతూ ''ఇందులో నేను రాంబాబు అనే సాదాసీదా మనిషిగా నటిస్తున్నాను. ప్రతి కుటుంబంలోనూ కొన్ని మంచి సంగతులు జరుగుతుంటాయి. కొన్ని నచ్చనవీ జరుగుతుంటాయి. అలాంటి నచ్చని విషయాలతో ఓ సాధారణ వ్యక్తి ఎలా పోరాడాడు అనేది తెరపై చూడాలి'' అన్నారు.

  దర్శకురాలు శ్రీప్రియ మాట్లాడుతూ ''సినిమాలోనే కాదు.. బయట కూడా నాకు నచ్చే వ్యక్తి వెంకటేష్‌. అతనితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు. నిర్మాతల్లో ఒకరైన రాజ్‌ కుమార్‌ సేతుపతి మాట్లాడుతూ ''ఈ సినిమాను తెలుగులో చేయాలనుకున్నప్పుడు హీరో ఎవరైతే బాగుంటుందని ఆలోచించాం. అందరూ వెంకటేష్‌ అని చెప్పారు. కమల్‌హాసన్‌ కూడా అదే మాట అన్నారు. ఈ సినిమాలో అతనే రాముడు.. అతనే భీముడు'' అన్నారు.

  మరో నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ '' ఈ సినిమా నిర్మించడం ఓ కొత్త అనుభవం. కుటుంబ కథాచిత్రాలను, థ్రిల్లర్‌ సినిమాలను చూసుంటాం. ఆ రెండింటినీ మేళవించి చేసిన చిత్రమిది'' అన్నారు. మీనా మాట్లాడుతూ ''ఇందులో జ్యోతి అనే గృహిణిగా కనిపిస్తాను. వెంకటేష్‌కు నాకు మధ్య వచ్చే సన్నివేశాలు ఇంటిల్లిపాదికీ నచ్చుతాయి'' అన్నారు.

  చిత్ర సమర్పకుడు రామానాయుడు మాట్లాడుతూ ''ఈ సినిమా గురించి నాకు బాగా తెలుసు. చాలా మంచి సినిమా. తెలుగులోనూ తప్పక విజయం సాధిస్తుంది'' అన్నారు. నదియా మాట్లాడుతూ ''ఇందులో నేను పోలీసు అధికారిణిగా నటించాను. కథంతా రాంబాబు మీదే సాగుతుంది. ఇది అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అన్నారు.

  English summary
  Akkineni Akhil tweeted: "Saw Drishyam yesterday. the 2nd half is outstanding. Very well layed out movie with an outstanding screenplay. Congrats to the team ! ATB. congrats to the one and only Victory Venkatesh uncle ! He was brilliant, also congrats to Suresh uncle and the whole team!".
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more