»   » అఖిల్ పెళ్ళికి పసుపుకొట్టారు... రామ్ చరణ్ భార్య ఉపాసనకూడా అక్కడే

అఖిల్ పెళ్ళికి పసుపుకొట్టారు... రామ్ చరణ్ భార్య ఉపాసనకూడా అక్కడే

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది అక్కినేని వారసుల పెళ్లి హంగామానే. అక్కినేని నాగార్జున పెద్ద వారసుడు నాగచైతన్య, చినవారసుడు అఖిల్ పెళ్లికి సిద్ధమైపోయిన సంగతి, ఈ నెల 9న అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగిన సంగతి తెలిసిందే. జీవీకే మనుమరాలు శ్రియా భూపాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు.

అక్కినేని వారసుడు అఖిల్.. జీవీకే మనవరాలు శ్రేయా భూపాల్ లకు పెళ్ళి పనులు ప్రారంభమయ్యాయి. గత రెండు వారాల క్రితం వారిద్దరికి నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఓ వారం పాటు అఖిల్ వీక్ అంటూ.. టాలీవుడ్ కుర్రకారు అంతా కలిసి విపరీతంగా సెలబ్రేట్ చేసేసుకున్నారు. పార్టీలతో హంగామా చేసిపారేశారు. ఇప్పుడు పార్టీలు పూర్తయిపోయి.. మళ్లీ అసలు వేడుకలోకి వచ్చేసింది వ్యవహారం. నిశ్చితార్థం తర్వాత ఫ్రెండ్స్‌తో పార్టీలు, హంగామా తర్వాత పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు.

Akkineni Akhil Shriya Bhupal Wedding Celebrations Pasupu Function

పెళ్లి కూతురు శ్రియా భూపాల్ ఇంట్లో పెళ్లిపనులను ప్రారంభించేశారు. సంప్రదాయం ప్రకారం పసుపు కొట్టే కార్యక్రమంతో పెళ్లి పనులను స్టార్ట్ చేశారు. పెళ్లికూతురుతో పాటు ఆమె తల్లి, ఫ్రెండ్స్, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పసుపు బట్టలు ధరించి సంప్రదాయ రీతిలో కార్యక్రమం నిర్వహించారు.

అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విశేషమేమంటే శ్రేయ భూపాల్ తో ఉపాసనకి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈమె కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని అక్కడి వారిని ఉత్సాహపరచింది. అఖిల్- శ్రేయ భూపాల్ ఎంగేజ్ మెంట్ లోను ఉపాసన సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటో ఆన్‌లైన్‌లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. జీవీకే ఇంట పెళ్లిపనులు అధికారికంగా మొదలైపోగా.. మరికొన్ని రోజుల్లో అక్కినేని ఇంట కూడా సందడి ప్రారంభంకానుంది. మరిన్ని వేడుకలను కూడా త్వరలోనే పూర్తి చేసేయనున్నారట. వచ్చే ఏడాది మే నెలలో అఖిల్-శ్రేయాల పెళ్లి.. టస్కనీలో జరగనున్న సంగతి అక్కినేని ఫ్యాన్స్ కి తెలుసు కదా.

English summary
Ram charan's wife Upasana Kamineni participated in Akkineni Akhil Shriya Bhupal Wedding Celebrations Pasupu Function
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu