»   » నాగార్జున ఎఫైర్ల గురించి అమల.. (వీడియో)

నాగార్జున ఎఫైర్ల గురించి అమల.. (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అంటే అమ్మాయిలు పడి చస్తారు. హీరోయిన్లంతా ఆయనతో సినిమా చేయాలని ఆరాట పడుతుంటారు. 50 ఏళ్ల పైబడిన వయసులోనూ యంగ్ లుక్ తో మెరిసి పోతున్న నాగార్జునపై మీడియాలో ఎప్పుడూ ఒక రూమర్ చక్కర్లు కొడుతూ ఉంటుంది.

ఆ హీరోయిన్ తో నాగార్జునకు ఎఫైర్ ఉందని, ఈ హీరోయిన్ తో ఆయన విదేశాల్లో గడిపారంటూ రకరకాల రూమర్స్. నాగార్జునకు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయని చాలా మంది ప్రేక్షకులు బలంగా నమ్ముతారు అంటే ఈ రూమర్ల ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.

Akkineni Amala about Nagarjuna Affairs

ఈ నేపథ్యంలో అక్కినేని అమలకు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో నాగార్జున ఎఫైర్ల గురించిన ప్రశ్న ఎదురైంది. దీనికి అమల సమాధానం చెబుతూ.....ఈ వార్తల గురించి నేను చాలా సార్లు చదివాను. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఆయనపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పారు.

అందుకు కొన్ని ఉదాహరణలు చెబుతూ.....ఓ సారి నేను నాగార్జున పక్కనే ఉన్నాను. కానీ ఓ రిపోర్టర్ వేరే అమ్మాయితో ఉన్నట్లు రాసారు. ఓసారి సింగపూర్ వెళ్లినపుడు గుండు చేయించుకున్నాను. అక్కడ ఎయిర్ పోర్టులో ఉండే ఇండియన్స్ నన్ను గుర్తు పట్టలేదు. నాగార్జున ఎవరో అమ్మాయితో తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన పక్కన ఉన్నది నేనే అని తెలియడంతో కూల్ అయ్యారు అని అమల చెప్పుకొచ్చారు.

English summary
In Open Heart With RK, watch Amala Akkineni talking about her Husband Nagarjuna. And she says that her Husband didn't get any affairs with any ladies and he always be with me.
Please Wait while comments are loading...