»   »  నాగార్జున ఆనందం! గర్వంగా ఉందంటూ అఖిల్ ట్వీట్స్

నాగార్జున ఆనందం! గర్వంగా ఉందంటూ అఖిల్ ట్వీట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని అఖిల్‌, శ్రీయ భూపాల్‌ల పెళ్లి క్యాన్సిల్‌ అయిందన్న వార్త గత కొద్ది రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ గా ఈ విషయమై ఖండనలు సైతం రాకపోవటంతో దాదాపు ఈ విషయం నిజమే అని అందరూ నమ్మే పరిస్దితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో నాగార్జున, అఖిల్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండటం లేదు. అయితే తాజాగా ఓ అకేషన్ తో ఈ కుటుంబం మళ్లీ తిరిగి ఉత్సహం పుంజుకుంది.

ప్రముఖ సినీ నటి అక్కినేని అమల 2016 సంవత్సరానికిగాను నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అక్కినేని అమలకు నారీశక్తి పురస్కారాన్ని ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

బహు భాషా నటి, జంతు సంక్షేమ కార్యకర్త అమలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నారీ శక్తి పురస్కారంతో సత్కరించిన... సందర్భంగాఅక్కినేని నాగార్జున ట్విటర్‌ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు.

ఎటువంటి స్వార్థం లేకుండా సమాజసేవ చేసినందుకుగానూ తన ప్రియమైన అమలను నారీ శక్తి పురస్కారంతో గౌరవించారని, ఇది చాలా గర్వంగా ఉందనినాగ్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా అమల ఫొటోను పోస్ట్‌ చేశారు.

సమాజానికి అద్భుతమైన సేవలు చేసినందుకు అమ్మ నారీ శక్తి పురస్కారం అందుకుందని, చాలా గర్వంగా ఉందని కుమారుడు అక్కినేని అఖిల్‌ ట్వీట్‌ చేశారు.

అక్కినేని అమల తాజాగా మలయాళ ప్రాజెక్టు కేరాఫ్ సైరాభాను మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆంటోనీ సోనీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ మార్చి 17న విడుదల కానున్నట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీలో అమల లాయర్ పాత్రలో కనిపించనుంది. ప్రముఖ మలయాళ హీరోయిన్ మంజువారియర్ కీలక పాత్రలో నటిస్తుంది. కేరాఫ్ సైరాభాను మూవీ ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.

English summary
On the occasion of International Women’s Day, President Pranab Mukherjee gave the prestigious Nari Shakti Puraskars in New Delhi. “I am so proud of dear amala/she received the Nari Shakti Purashkaar from the president this morning for all her selfless Sevice to society 💐💐💐” the proud husband Mr.Nagarjuna posted this on his Twitter and expressed his joy and happiness.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu