»   » అఖిల్, చైతూ ఇద్దరూ పంచె కట్టి...(ఫొటో)

అఖిల్, చైతూ ఇద్దరూ పంచె కట్టి...(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పంచెకట్టు కట్టి మరీ తన తాజా చిత్రంతో సంక్రాంతికి పండుగ చేయటానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ఆ పంచె కట్టుని ఆయన కుమారులు అక్కినేని అఖిల్, అక్కినేని నాదచైతన్య లు ఇద్దరూ కట్టారు. మాటీవి పోగ్రామ్ లో తన తండ్రితో పాటు వీళ్లిద్దరూ పాల్గొననున్నారు. ఆ ఫొటోని నాగచైతన్య తన ట్విట్టర్ పేజీ ద్వారా తన అభిమానులకు అందచేసి, ఆనందింప చేసారు. ఆఫొటో మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

నాగార్జున తన సొంత బ్యానర్ లో చేసిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా'. సెన్సార్ నుంచి ‘యు/ఏ' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా జనవరి 15న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి కుటుంబకథా చిత్రంగా చేసిన ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం(తండ్రి - కొడుకులుగా)లో కనిపించనున్నాడు.

నాగార్జున మాట్లాడుతూ.. తొలిసారిగా ‘సోగ్గాడే చిన్నినాయనా' ఫుల్ కామెడీ చిత్రంలో తాను నటిస్తున్నానని, సోగ్గాడిగా, అమాయకుడిగా రెండు పాత్రల్లో తేడాలు ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో తండ్రి పాత్ర ఇందులో ఘోష్ట్‌గా కనిపిస్తుందని, చనిపోయిన తర్వాత కొడుక్కుమాత్రమే కనబడే విచిత్రమైన ఆ పాత్రలో తాను నటించానని తెలిపారు.

Akkineni brothers in traditional attire!

ఫాదర్‌ క్యారెక్టర్‌ ఇందులో ఘోస్ట్‌గా కనిపిస్తుంది. చనిపోయిన తర్వాత కొడుక్కి మాత్రమే కనబడే విచిత్రమైన క్యారెక్టర్‌ అది. ఈ పాయింట్‌ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌ అనిపించింది. వెంటనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. రెండు క్యారెక్టర్స్‌ను బేస్‌ చేసుకుని 'సొగ్గాడే చిన్ని నాయనా' అనే టైటిల్‌ పెట్టామని తెలిపారు.

నాగార్జున. కింగ్‌ నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.

English summary
Naga Chaitanya and Akhil Akkineni looked splendid in traditional attire.
Please Wait while comments are loading...