»   » అదరగొడుతున్న అక్కినేని బ్రదర్స్ (ఫోటో)

అదరగొడుతున్న అక్కినేని బ్రదర్స్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈతరం హీరోలకు ఉండాల్సిన ప్రధాన క్వాలిఫికేషన్లలో ఆకట్టుకునే శరీర సౌష్టవం అతి ప్రధానమైనది. నటించే టాలెంటుతో పాటు పర్‌ఫెక్టు బాడీ స్టక్చర్ ఉన్నపుడే వారు ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతారు. అందుకే యువ హీరోలంతా తమ శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఏ మాత్రం సమయం దొరికినా జిమ్(వ్యాయామశాల)లో వాలిపోతుంటారు.

అక్కినేని నాగార్జున నట వారసులైన నాగచైతన్య ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంటు నిరూపించుకున్న సంగతి తెలిసిందే. మరో తనయుడు అఖిల్ త్వరలో వెండితెరంగ్రేటానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఇద్దరు జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సందర్భంగా దిగిన ఫోటో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతం నాగ చైతన్య 'మనం' చిత్రంలో తాత ఏఎన్ఆర్, తండ్రి నాగార్జునతో కలిసి నటిస్తున్నారు. మరో వైపు చైతన్య నటించిన 'ఆటో నగర్ సూర్య' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రేమకావాలి, పూలరంగడు వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన కె.అచ్చిరెడ్డి తాజాగా 'ఏమాయ చేసావె' జంట నాగ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా 'వెన్నెల', 'ప్రస్తానం' లాంటి ఉత్తమ చిత్రాలను రూపొందించిన దేవా కట్ట దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ఆటో నగర్ సూర్య' షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటోంది.

అక్కినేని మూడు తరాల హీరోలు నటిస్తున్న 'మనం' సినిమా విషయానికొస్తో....శ్రీమతి అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇష్క్ మూవీ ఫేం విక్రమ్ కుమార్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
Akkineni brothers Naga Chaitanya and his younger brother Akhil were spotted working out in gymnasium.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu