»   »  లారెన్స్ అంటే అక్కినేనికి అసూయ!!

లారెన్స్ అంటే అక్కినేనికి అసూయ!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు ఒకరిని చూసి అసూయ పడుతున్నారట. ఈ వయసులో ఆయనకు అసూయేమిటనుకుంటున్నారా..అంతలా ఫీలవల్సిన అవసరంలేని అసూయే. అంటే ఆరోగ్యకరమైన అసూయే. వివరాలలోకి వెళితే...బుధవారంనాడు శిల్పకళావేదికలో డాన్ ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డాన్ సినిమాకు దర్శకత్వం వహించిన లారెన్స్ ను చూస్తుంటే చాలా అసూయ కలుగుతోంది. కొరియోగ్రాఫర్ నుంచి మాస్ సినిమాతో లారెన్స్ దర్శకుడిగా ప్రమోషన్ పొందాడు. డాన్ సినిమాకు దర్శకత్వమే కాకుండా సంగీతాన్ని కూడా అందించారు. ఇది కాదు అసలు విషయం. హ్యాండీక్యాప్ పిల్లలతో కలిసిపోయి వారితో సంగీత విభావరిలను నిర్వహించడం నేను అసూయ పడేలా చేస్తోంది. ఆయన సినిమాలకు ఎన్ని చేసినా పెద్ద విషయం కాదు. కానీ హ్యాండీక్యాప్ పిల్లలు ఆత్మవిశ్వాసం పొందేలా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం. ఆ పని నేను చేయలేక పోయానే అని అసూయ పడుతున్నాను. ఇక్కడ అసూయ అంటే అర్థం అసూయ కాదు. లారెన్స్ చేస్తున్న గొప్పపని నేను చేయలేక పోతున్నానని ఫీలింగ్.... అని నాగేశ్వరరావు వివరించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X