For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాని ప్లేసులో ఇంకొకరు ఉంటే ఫోన్ నేలకేసి కొట్టేవాన్ని: నాగార్జున

  |
  Nagarjuna @Devadas Movie Press Meet

  నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీ స్టారర్ 'దేవదాస్' సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వని దత్‌ నిర్మించారు. సినిమా ప్రమోషన్లో భాగంగా నాగార్జున మీడియా వారితో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నాగార్జున నుండి పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. నాని ఎప్పుడూ ఫోన్లో ఉంటాడంటూ ఆ మధ్య నాగార్జున ఆటపట్టించారు. ఈ విషయం గురించి మీడియా వారు కదిలించగా నాని తీరుపై నాగార్జున కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు.

  నాని పెద్ద హీరో కాబట్టి మేము ఏమీ అనడం లేదు

  నాని పెద్ద హీరో కాబట్టి మేము ఏమీ అనడం లేదు

  ఈ విషయమై నాగార్జున స్పందిస్తూ... నాని సెట్లో ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటారు. నిద్రలో కూడా ఫోన్ లేకుండా ఉండలేడేమో? సెట్లో ఎవరూ ఫోన్ వాడరు. తను పెద్ద హీరో అని చెప్పి ప్రొడ్యూసర్లు కానీ, మేముకానీ ఏమీ అనడం లేదు. అదే ప్లేసులో ఇంకొకరు ఎవరైనా ఉంటే నేను ఫోన్ తీసుకుని విరగ్గొట్టేవాడిని. తనే అంటాడు ఇదొక డిసీజ్ అయిపోయింది సార్... దీని నుండి ఎలా బయట పడాలో అర్థం కావడం లేదని... నాని చెప్పినట్లే అదొక డిసీజ్. బయట కూడా ఇలాంటి సెల్ ఫోన్ డిసీజ్ ఉన్నవారు చాలా మంది ఉన్నారు అని నాగార్జున చెప్పుకొచ్చారు.

  ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి

  ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి

  నేను ఇన్నేళ్లయినా ఇలాగే అందంగా ఉండటానికి కారణం 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వ్యయామం చేయడమే. నా వయసు ఇప్పుడు 59. కానీ మానసికంగా 25 ఏళ్ల వయసులోనే ఉండిపోయాను. అయితే మా పిల్లలకు సలహాలు ఇచ్చే విషయంలో మాత్రం పెద్దవాడిగా మారిపోతాను అని నాగార్జున అన్నారు.

  నా వయసుకు తగిన పాత్రలే చేస్తాను

  నా వయసుకు తగిన పాత్రలే చేస్తాను

  ‘మల్టీస్టారర్‌ సినిమాలు చేయడానికి కారణం... ఇపుడు సోలో ప్రేమ కథలు చేయలేను. అదే సమయంలో ఉద్యోగస్థుడి పాత్రలకు నా ఏజ్ సెట్టవ్వదు. వాటికి భిన్నంగా చేయాలంటే నా వయసుకు తగ్గట్టు ‘దేవదాస్' లాంటి స్టోరీలు ఎంచుకోవడమే మంచిదని నా అభిప్రాయం. యంగ్‌ హీరోలతో నా కాంబినేషన్‌ కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది. మల్టీ స్టారర్ చిత్రాలు చేయడం అంటే ముందు నుండీ ఇష్టమే. కానీ అప్పట్లో ఇలాంటి కథలు రాలేదు. అందుకే నా తోటి హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేయలేక పోయాను అని నాగార్జున అన్నారు.

  దేవ పాత్ర గురించి

  దేవ పాత్ర గురించి

  ‘నేను చాలా సార్లు డాన్‌ పాత్రలు చేశాను. వాటితో పోల్చితే దేవ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఇందులో గూండాయిజంలాంటివి ఉండవు. దేవ బాగా నవ్విస్తాడు. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం కూడా అదే. రెండు పాత్రల మధ్య స్నేహం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో మా కాంబినేషన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది అనుకుంటున్నాను. నాని గురించి వ్యక్తిగతం తెలియదు, సెట్స్‌లో చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడు అని నాగార్జున తెలిపారు.

  ఒత్తిడిని ఇద్దరం పంచుకుంటా

  ఒత్తిడిని ఇద్దరం పంచుకుంటా

  ‘ఇద్దరు హీరోలు కలిసి నటించాం కాబట్టి అంచనాలు కూడా అలాగే ఉంటాయి. మాపై ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది. సినిమా సరైన ఫలితం రాకపోతే విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తాయని తెలుసు. ఆ ఒత్తిడిని మాత్రం ఇద్దరం పంచుకుంటాం కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఉండదు అని నాగార్జున అన్నారు.

  ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

  ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

  ‘ప్రస్తుతం రాహుల్‌ రవీంద్రన్‌, కళ్యాణ్ కృష్ణ కథలు సిద్ధం చేస్తున్నారు. ఆ రెండు కథల్లో ఏ సినిమా ముందు సెట్స్‌పైకి వెళ్తుందో తెలియదు. హిందీలో ‘బ్రహ్మాస్త్ర' చేస్తున్నా. తెలుగు, తమిళ భాషల్లో ధనుష్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నా. ధనుష్ మూవీలో 600 ఏళ్ల కిందటి వ్యక్తి పాత్రలో కనిపిస్తాను.ఇందులో విజువల్ ఓఫెక్ట్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అని నాగార్జున తెలిపారు.

  English summary
  Akkineni Nagarjuna about DevaDas movie and Nani. Devadas is an Indian Telugu action comedy movie featuring an ensemble cast of Nagarjuna Akkineni, Nani, Rashmika Mandanna and Aakanksha Singh in the lead roles. It is a drama style comedy film, both written and directed by Sriram Adittya, which is set to hit the big screens on 27 September 2018.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X