»   » నాగార్జున, సమంత కలిశారు.. కాబోయే మామ, కోడళ్లు ఏం చేశారంటే..

నాగార్జున, సమంత కలిశారు.. కాబోయే మామ, కోడళ్లు ఏం చేశారంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత రాజుగారి గది2 చిత్రంలో నాగార్జునతో సమంత కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ చిత్ర షూటింగ్‌లో నాగార్జున, సమంతలు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు నాగ్, సమంత కలిసి పాల్గొన్న సీన్ల షూటింగ్ జరుగలేదు. తాజా షెడ్యూల్‌లో వారి మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది.

రాజుగారి గది2 లో..

రాజుగారి గది2 లో..

నమో వెంకటేశాయ చిత్రం తర్వాత వెంటనే నాగార్జున రాజుగారి గది2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పాండిచ్చేరిలో ఇటీవల షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొన్ని రోజులుగా షూటింగ్ నిర్విరామంగా చేస్తున్నట్టు సమాచారం. మనం చిత్రం తర్వాత, చై ఎంగేజ్‌మెంట్ తర్వాత నాగార్జున, సమంతలు కలిసి నటించడం ఇదే తొలిసారి.

నాగ్, సమంతలు కలిసి..

నాగ్, సమంతలు కలిసి..

నాగార్జున, సమంత కలిసి ఉన్న సీన్లను దర్శకుడు ఓంకార్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తొలిసారి వారు కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారు అని సినిమా యూనిట్ వర్గాలు వెల్లడించాయి. రాజుగారి గది విజయవంతమైన తర్వాత రాజుగారి గది2 సినిమాను ఓంకార్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

అదే ఊపులో రాజుగారి గది2

అదే ఊపులో రాజుగారి గది2

చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన రాజుగారి గది సినిమా అనూహ్య విజయం సాధించింది. దర్శకుడిగా ఓంకార్‌కు మంచి పేరు తెచ్చింది. ఆ చిత్రం అందించిన ఊపుతో రాజు గారి గది2 సినిమాను తెరెకెక్కిస్తున్నాడు ఓంకార్. ఇటీవల రాజుగారి గది2 చిత్ర విశేషాలను ఓంకార్ మీడియాతో పంచుకొన్నారు.

రాజుగారి గది సీక్వెల్ కాదు..

రాజుగారి గది సీక్వెల్ కాదు..

రాజుగారి గది2 సీక్వెల్ కాదు. మలయాళం చిత్రానికి సంబంధించిన కథను తీసుకొన్నాం. తెలుగు నేటివిటికి తగినట్టుగా ఆ కథకు మార్పులు చేశాం అని ఓంకార్ తెలిపారు. ఈ చిత్రంలో నాగార్జునకు జంటగా హీరోయిన్‌గా సీరత్ కపూర్ నటిస్తున్నది. ఈ చిత్రానికి సంగీతం ఎస్ఎస్ తమన్ అందిస్తున్నారు.

English summary
Tollywood Hero Akkineni Nagarjuna and would-be daughter-in-law Samantha are joining hands for the Telugu horror flick Raju Gari Gadhi 2. Raju Gari Gadhi 2, making after blockbuster film of the same name is directed by Omkar. SS Thaman is giving music to this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu