twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నపూర్ణ స్టూడియోలోనే ఏఎన్ఆర్ అంత్యక్రియలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బుధవారం పరమపదించిన తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఎర్రగడ్డ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ...ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలోనే జరుపాలని నిర్ణయిచారు.

    ఈ రోజు (గురువారం) మధ్యహ్నం రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది అక్కినేనికి గౌరవంగా గన్ సెల్యూట్ చేయనున్నారు. ఈ మహానటుడి అంత్యక్రియలకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసారు.

    Akkineni Nageswara Rao to be cremated at Annapurna Studios

    గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అక్కినేని నగరంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం అర్థరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 2-45 నిముషాలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో 1920 సెప్టెంబర్ 20న ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన అక్కినేని వయస్సు 91 సంవత్సరాలు. 1944లో సినీ ప్రస్థానం మొదలెట్టిన నాగేశ్వరరావు తొలి చిత్రం ధర్మపత్ని. చివరి చిత్రం మనం. ఆయన ధరించిన ఎన్నో పాత్రలు చిరస్మరణీయాలై మిగిలిపోయాయి.

    ఎన్నో బిరుదులు, సత్కారాలు ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. ఆయన భార్య అన్నపూర్ణ కొన్ని ఏళ్ళ కిందట మరణించారు. అక్కినేని నాగేశ్వరరావు నటజీవితం స్ర్తి పాత్రలతో మొదలైంది. బతుకుతెరువు కోసం ఆయన నాటకాల్లో స్ర్తి పాత్రలు వేసేవారు. ఘంటసాల బలరామయ్య ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. సాంఘిక, పౌరాణిక, జానపదం ఇలా అన్నిరకాల పాత్రలను పోషించిన అక్కినేని మొత్తం 256 చిత్రాలలో నటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ తరలించడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం. ఆ కృషిలో భాగంగా తొలుత అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు.

    English summary
    Dr. Akkineni Nageswara Rao, will be cremated with full state honours today (Jan 23rd) afternoon at Annapurna Studios.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X