»   » సర్జరీ: అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్య వివరాలు

సర్జరీ: అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్య వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ లెజెండ్, ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నట్లు వైద్యులు ఇటీవల గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అక్కినేని స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది సాధారణ జబ్బే, పైగా వృద్ధాప్యంలో రావడం ఆనందించ దగ్గ విషయమే, ఈ వయసులో క్యాన్సర్ కణాల వ్యాప్తి నెమ్మదిగా ఉంటుందని నాగేశ్వరరావు తెలిపారు.

కాగా...ఆయన శరీరంలోని క్యాన్సర్ కణాలను తొలగించేందుకు వైద్యులు ఈ నెల 19న సర్జరీ నిర్వహించారు. హైదరాబాద్‌లో KIMS ఆసుపత్రిలో సర్జరీ సక్సెస్ ఫుల్‌గా పూర్తయింది. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయన హార్ట్ బీట్ కూడా సాధారణ స్థాయిలోనే ఉందని తెలిపారు.

కాగా... సర్జరీ తర్వాత మంచానికే పరిమితం అయిన ఆయన ఈ రోజు లేచి కొంతదూరం నడిచారు. ప్రస్తుతం ఆయనకు నోటి ద్వారా కొన్ని ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న ఆయన రెండు మూడు రోజుల్లో సాధారణ రూంకు షిప్ట్ అయ్యే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాల సమాచారం.

English summary
Veteran Actor Akkineni Nageswara Rao underwent abdominal surgery on 19th night for intestinal obstruction at KIMS hospital. Surgery went smoothly. Over the last couple of days, he has been comfortable, stable, and gradually recovering.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu