»   » అక్కినేని అంతిమయాత్ర, పోలీసుల గన్ సెల్యూట్ (ఫోటోలు)

అక్కినేని అంతిమయాత్ర, పోలీసుల గన్ సెల్యూట్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా లెజెండ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో ముగిసాయి. అక్కినేని వారసులు వెంకట్, నాగార్జున, సుమంత్, నాగ చైతన్య, సుప్రియ, అఖిల్ తదితరులు ఈ అంత్యక్రియల క్యార్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కినేనికి గన్ సెల్యూట్ చేసారు. అంతకు ముందు ఏపీ ఫిల్మ్ చాంబర్ నుండి అక్కినేని పార్తివ దేహాంతో అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో వేలాది మంది అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు, సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అక్కినేని నగరంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం అర్థరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 2-45 నిముషాలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో 1920 సెప్టెంబర్ 20న ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన అక్కినేని వయస్సు 91 సంవత్సరాలు. 1944లో సినీ ప్రస్థానం మొదలెట్టిన నాగేశ్వరరావు తొలి చిత్రం ధర్మపత్ని. చివరి చిత్రం మనం. ఆయన ధరించిన ఎన్నో పాత్రలు చిరస్మరణీయాలై మిగిలిపోయాయి.

ఎన్నో బిరుదులు, సత్కారాలు ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. ఆయన భార్య అన్నపూర్ణ కొన్ని ఏళ్ళ కిందట మరణించారు. అక్కినేని నాగేశ్వరరావు నటజీవితం స్ర్తి పాత్రలతో మొదలైంది. బతుకుతెరువు కోసం ఆయన నాటకాల్లో స్ర్తి పాత్రలు వేసేవారు. ఘంటసాల బలరామయ్య ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. సాంఘిక, పౌరాణిక, జానపదం ఇలా అన్నిరకాల పాత్రలను పోషించిన అక్కినేని మొత్తం 256 చిత్రాలలో నటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ తరలించడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం. ఆ కృషిలో భాగంగా తొలుత అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు.

 ఫిల్మ్ చాంబర్లో..

ఫిల్మ్ చాంబర్లో..

అన్నపూర్ణ స్టూడియోకు తరలించడానికి ముందు అక్కినేని మృత దేహాన్ని ఏపీ ఫిల్మ్ చాంబర్లో ఉంచారు.

అనుష్క, జయసుధ

అనుష్క, జయసుధ

సినీ నటీమణులు అనుష్క, జయసుధ ఏపీ ఫిల్మ్ చాంబర్‌కు చేరుకుని అక్కినేనికి నివాళులు అర్పించారు.

అభిమానులు

అభిమానులు

ఏపీ ఫిల్మ్ చాంబర్లో అక్కినేని భౌతిక కాయాన్ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

అధికారిక లాంఛనాలు

అధికారిక లాంఛనాలు

అక్కినేని అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

పోలీసుల గౌరవ వందనం

పోలీసుల గౌరవ వందనం

రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాల్లో భాగంగా అక్కినేని భౌతిక కాయానికి పోలీసులు గౌరవ వందనం చేసారు.

అక్కినేని భౌతిక కాయాన్ని తరలిస్తూ...

అక్కినేని భౌతిక కాయాన్ని తరలిస్తూ...

అక్కినేని భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ నుండి అన్నాపూర్ణ స్టూడియోకు తరలిస్తున్న దృశ్యం.

అంతిమ యాత్ర

అంతిమ యాత్ర

అక్కినేని నాగేశ్వరరావు అంతిమ యాత్ర దృశ్యాలు. గౌరవ సూచకంగా పోలీసుల ర్యాలీ.

తెలుగు సినిమా లెజెండ్

తెలుగు సినిమా లెజెండ్

అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా లెజెండ్. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు మరువలేనివి.

 జనసంద్రం

జనసంద్రం

అక్కినేని అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొనడంతో రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి.

English summary
Akkineni Nageswara Rao's funeral complete with full state honours at Annapurna Studios today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu