»   » చెల్లెలి కోసం చాలానే చేస్తోంది..? తమిళ్ హీరో అజిత్ తో శృతీహసన్

చెల్లెలి కోసం చాలానే చేస్తోంది..? తమిళ్ హీరో అజిత్ తో శృతీహసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ రంగంలోకైనా కొత్తవారు వస్తూనే ఉంటారు. సినిమా రంగంలోకి కొత్త వారు ఎవరైనా వస్తే వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారనే దానిపై ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా చిత్రసీమకు పరిచయం కాబోతున్న వారు ఇప్పటికే నటుల కుటుంబాలకు చెందిన వారయితే మరింత క్రేజ్‌ ఉంటుంది. అలా పరిచయమై రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అందులో కమల్ కూతుళ్ళు శృతీ, అక్షర లు కూడా ముందు తడబడ్డా తర్వాత నిలదొక్కుకొని నటిగా బాగానే రాణిస్తోంది శృతి కానీ అక్షర పరిస్థితే ఇంకా ఎటూతేలలేదు.

కోలీవుడ్ హీరో దనుష్ బాలీవుడ్ లో చేసిన "షమితాబ్" లో నటనకు ప్రశంసలు వచ్చాయి గానీ అవకాశాలు రాలేదు. ప్రయత్నాలలో పడ్డ అక్షర ఇక లాభం లేదనుకొని తన తండ్రి తీస్తున్న "శభాష్ నాయుడు" సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిపోయింది...

ఐతే చాలా విరామం తర్వాత మళ్లీ ఆమెకు ఓ సినిమాలో నటించే ఛాన్స్ దొరికింది. అది కూడా అజిత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కావడం విశేషం. గత ఏడాది 'వేదాలం'తో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన అజిత్.. మరోసారి 'శౌర్యం' శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్షర ఓ కీలక పాత్ర చేయబోతోంది. అక్షర ఎవరూ అంటారా..? కమల్ రెండోకూతురు ఇప్పటి హీరోయిన్ శృతీ హసన్ కి చెల్లెలు...

Akshara Hassan Cameo In Ajith’s Next

ఆ మధ్య కోలీవుడ్ హీరో ధనుష్ బాలీవుడ్ లో చేసిన "షమితాబ్" లో చేసిన అక్షర నటన కి అందరూ కితాబులిచ్చారు కానీ అవకాశాలు మాత్రం ఎవరూ ఇవ్వలేదు. ఐతే చాలా విరామం తర్వాత మళ్లీ ఆమెకు ఓ సినిమాలో నటించే ఛాన్స్ దొరికింది. అది కూడా అజిత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కావడం విశేషం.

గత ఏడాది "వేదాలం" తో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన అజిత్.. మరోసారి 'శౌర్యం' శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్షర ఓ కీలక పాత్ర చేయబోతోంది. ఐతే ఆమెది హీరోయిన్ క్యారెక్టర్ కాదంటున్నారు. 'వేదాలం'లో అజిత్ పక్కన శ్రుతినే హీరోయిన్ కావడం విశేషం. ఆ సందర్భంగా అక్షర గురించి శ్రుతి రికమండ్ చేసిందని.. తన తర్వాతి సినిమాలో అజిత్ ఆమెకు ఛాన్సిస్తున్నాడని అంటున్నారు చెన్నై జనాలు.

English summary
If reports are anything to go by, Akshara is offered a crucial role in Tamil star hero Ajith’s 57th film to be directed by Veerudokkade and Vedalam fame.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu