»   » అక్షర హాసన్‌కు బంపర్ ఆఫర్: సోదరి బాటలోనే...

అక్షర హాసన్‌కు బంపర్ ఆఫర్: సోదరి బాటలోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ ఎట్టకేలకు ఓ బంపర్ ఆఫర్ కొట్టింది. ఆమెకు ఓ సినిమాలో హీరోయిన్ పాత్ర లభించింది. ఆమె తన సోదరి శ్రుతి హాసన్ బాటలోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సినీ రంగంలో తాను చేయదలుచుకున్నదొక్కటైతే అవకాశం లభిస్తోంది మరోదానికి. శ్రుతి హాసన్ విషయంలోనూ ఇదే జరిగింది. శ్రుతిహాసన్‌కు సంగీతంపై మక్కువ ఎక్కువ. ఆమె సంగీత కళాకోవిదురాలిగా రాణించాలని అనుకుంది.

అల్బమ్‌లో చేసి ఇలా...

అల్బమ్‌లో చేసి ఇలా...

సంగీతంలో రాణించాలని భావించి శ్రుతి హాసన్ పలు ప్రైవేట్ ఆల్బమ్‌లు చేసింది. అందులో భాగంగానే తన తండ్రి నటించిన ఉన్నైపోల్ ఒరవన్ చిత్రం ద్వాా సంగీత దర్శకురాలిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత అనుకోకుండా హీరోయిన్‌గా తెర మీద ఉర్రూతలూగించడం ప్రారంభించింది.

గబ్బర్ సింగ్‌తోనే స్టార్ డమ్....

గబ్బర్ సింగ్‌తోనే స్టార్ డమ్....

హిందీలో లక్ చిత్రం ద్వారా శ్రుతి హాసన్ తన లక్కును పరీక్షించుకుంది. అయితే, పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తెలుగు చిత్రం గబ్బర్ సింగ్ సినిమాతోనే ఆమెను స్టార్ డమ్ వరించింది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.

అక్క మాదిరిగానే...

అక్క మాదిరిగానే...

అక్షర హాసన్ కెమెరా వెనక దర్శకురాలిగా రాణించాలని భావించింది. దానికోసం ఆమె దర్శకుడు బాల్కీ వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేశారు. అయితే, అనుకోకుండా హిందీ చిత్రం షమితాబ్ చిత్రం ద్వారా నటిగా ఆరంగేట్రం చేసింది. తాజాగా, అజిత్ హీరోగా నటిస్తున్న వివేగం చిత్రంలో ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది.

ఇలా హీరోయిన్ అవకాశం...

ఇలా హీరోయిన్ అవకాశం...

గతంలో చేసిన రెండు సినిమాల్లోనూ అక్షర హాసన్ హీరోయిన్ కాదు. తాజాగా ఆమెకు హీరోయిన్ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆ అవకాశం ఆమెకు శాండిల్‌వుడ్‌లో రావడం విశేషం. కన్నడంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్ వారసుడు విక్రమ్ చంద్రన్ హీరోగా చేస్తున్న చిత్రంలో అక్షరకు హీరోయిన్ అవకాశం లభించినట్లు తెలుస్తోంది.

English summary
It is said that Kamal Hassan second daughter Akshara Hassan is playing lead role in Kannada movie against Vikram Chandran.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu