»   » అతనితో అక్షర హాసన్ ఎఫైర్...క్లాస్ పీకిన తల్లి!

అతనితో అక్షర హాసన్ ఎఫైర్...క్లాస్ పీకిన తల్లి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమల్ హాసన్, సారికల కూతురు, శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రంలో అక్షర హాసన్ నటిస్తోంది. ఇంకా హీరోయిన్‌గా పరిచయం కానేలేదు అప్పుడే ఎఫైర్లలో మునిగి తేలుతోంది శృతి హాసన్.

బాలీవుడ్ నటుడు తనూజ్ విర్వానీతో అక్షర హాసన్ ఎఫైర్ నడుపుతోంది. తనూజ్ విర్వానీ ఎవరో కాదు నిన్నటి తరం బాలీవుడ్ నటి రాటి అగ్రిహోత్ని కుమారుడు. ఈ విషయం కాస్త అక్షర హాసన్ తల్లి సారికకు తెలిసిపోయింది. దీంతో వెంటనే కూతురును పిలిచి క్లాస్ పీకిందట. ప్రేమ దోమ అంటూ పిచ్చి వేషాలు వేయకుండా కెరీర్‌పై దృష్టి పెట్టాలని మందలించిందట.

Akshara Hassan's Affair Irks Her Mother Sarika

ఇటీవల ముంబైకి చెందిన పత్రికల్లో వీరి గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు వెలువడ్డాయి. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని, వీరి మధ్య గత కొంతకాలంగా ఉన్న స్నేహం హద్దు మీరిందని తెలుస్తోంది. వీరి వ్యవహారంపై సారిక చాలా అసంతృప్తిగా ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

వాస్తవానికి ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సారిక స్వయంగా వీరి వ్యవహారం కళ్లారా చూసిందట. పురానీ జీన్స్ అనే చిత్రంలో తనూజ్ విర్వానీతో పాటు సారిక కలిసి పని చేస్తున్నారు. ఇటీవల మనాలీలో ఈచిత్రం షూటింగ్ జరుగుతుండగా అక్షర హాసన్ స్వయంగా వచ్చి తనూజ్ విర్వానీ కలిసిందట. తనను కలిసే నెపంతో కూతురు ఇక్కడకు వచ్చి అతనితో టైం స్పెండ్ చేయడం సారికకు అస్సలు నచ్చడం లేదట.

English summary
Akshara Hassan, the daughter of Kamal Hassan and Sarika, is bonding big time with Bollywood actor Tanuj Virwani, the son of yesteryear actress Rati Agnihotri. Their relationship has irked her mother Sarika, who has advised her to concentrate only on her career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu