»   » కమల్ హాసన్ కూతురుతో నేను డేటింగ్ చేయడం లేదు

కమల్ హాసన్ కూతురుతో నేను డేటింగ్ చేయడం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కమల్ హాసన్- సారికల కూతురు, శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రంలో అక్షర హాసన్ నటిస్తోంది. ఇంకా హీరోయిన్‌గా పరిచయం కానేలేదు అప్పుడే ఎఫైర్లలో మునిగి తేలుతోంది అక్షర హాసన్ అంటూ ఈ మధ్య వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

బాలీవుడ్ నటుడు తనూజ్ విర్వానీతో అక్షర హాసన్ ఎఫైర్ నడుపుతోందని వార్తలు వచ్చాయి. అయితే అక్షర హాసన్ నుండి ఇప్పటి వరకు ఈ వార్తలపై ఎలాంటి స్పందన లేక పోయనా....తనూజ్ విర్వానీ మాత్రం స్పందించాడు. కమల్ హాసన్ కూతురుతో తాను డేటింగ్ చేయడం లేదని, అక్షర్ హాసన్ నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. మీడియాలో మా మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు విని షాకయ్యానంటూ వివరణ ఇచ్చాడు.

దీంతో పాటు 'పురానీ జీన్స్' చిత్రంలో తనతో హీరోయిన్‌గా నటిస్తున్న విరాట్ కోహ్లీ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఇసబెల్లె లియెట్‌తో కూడా లింక్ చేస్తూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు విని మేము ఇద్దరం నవ్వు కుంటున్నాం. మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని తనూజ్ చెబుతున్నాడు. తనూజ్ విర్వానీ ఎవరో కాదు నిన్నటి తరం బాలీవుడ్ నటి రాటి అగ్రిహోత్ని కుమారుడు.

Akshara hasaan
English summary
Tanuj, however, condemns the buzz about their live-in relationship. "Akshara is a dear friend of mine and there is nothing more than that! The problem is that media links me with every girl who was spotted with me," Tanuj said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu