»   » అక్షయ్ కుమార్ 'యాక్షన్‌ రిప్లే' హిట్టా? ఫట్టా?

అక్షయ్ కుమార్ 'యాక్షన్‌ రిప్లే' హిట్టా? ఫట్టా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ మధ్యన వరస హిట్స్ ఇచ్చిన అక్షయ్ కుమార్ ఇప్పుడు వరస ఫ్లాపులతో దూసుకుపోతున్నాడు. దీపావళి నాడు రిలీజైన ఆయన తాజా చిత్రం యాక్షన్ రీప్లే కాన్సెప్ట్ పరంగానూ, పబ్లిసిటీ పరంగానూ కొత్త హైప్ క్రియోట్ చేయగలిగినా భాక్సాఫీస్ వద్ద భోల్తా కొట్టింది. దర్శకుడు విపుల్ షా, అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో గతంలో నమస్తే లండన్‌, సింగ్‌ ఈజ్‌ కింగ్‌లలో వచ్చి విజయవంతమయ్యాయి. దాంతో ఈ చిత్రానికి మంచి మార్కెట్టే జరిగింది. అందులోనూ 'యాక్షన్‌ రిప్లే'. చిత్రం కోసం దాదాపు 40కోట్లు ఖర్చుచేసి, దేశవిదేశాలన్నింటిలో మొత్తం 1,800 థియేటర్లలో విడుదలచేశాడు.

కధ ప్రకారం చూస్తే...లెక్కలు చూసి మరీ ఖర్చుపెట్టే కిషన్‌(అక్షయ్ కుమార్‌), లెక్కా పత్రం లేకుండా షాపింగ్ పేరుతో ఖర్చుపెట్టే గయ్యాళి మాల(ఐశ్వర్య రాయ్)లు ఓ జంట. వీరి ప్రేమ ఫలం బంటీ(ఆదిత్యరాయ్ కపూర్‌). ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ, తిట్టుకుంటూ బతికే తల్లిదండ్రులని చూసి విసుగెత్తిన బంటీకి పెళ్ళి అంటే విరక్తి కలుగుతుంది. తనను ప్రాణంగా ప్రేమించే తాన్యా(సుధీరాసింగ్‌)ని నిరాకరిస్తాడు. మరో ప్రక్క తమ ఇరవయ్యో పెళ్లిరోజు పార్టీలో కూడా వారిద్దరూ దెప్పుకోవడం మొదలెట్టి, ఇద్దరూ విడిపోతారు.

ఆ సంఘటనతో మరింత దిగాలు పడిన బంటీని చూసిన తాన్యా తాత ఆంథోనీ గొంజాల్విస్‌(రణ్‌బీర్‌ కపూర్‌) ఓ ప్లాన్ చేస్తాడు. తను కనుగొన్న టైంమిషన్‌ సాయంతో బంటీని గతంలోకి అంటే అక్షయ్, ఐశ్వర్యల పెళ్లికాని ముందురోజులకు తీసుకు వెళ్ళి ఆ జంటను కలిపే ప్రయత్నం చేస్తాడు. డెబ్బైల నాటి బాంబే వాతావరణం ఈ చిత్రం చక్కగా చూపటం హైలెట్ గా చెప్పినా..ఇదొక నస సినిమాగా ప్రేక్షకులు తేల్చేసారు. మరో ప్రక్క దీపావళి కానుకగా విడుదలైన గోల్ మాల్-3 మాత్రం మంచి కలెక్షన్స్ సంపాదించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu