»   » జాతీయ జండాకు అవమానం: నన్ను క్షమించండీ, ఏం జరిగిందంటే..

జాతీయ జండాకు అవమానం: నన్ను క్షమించండీ, ఏం జరిగిందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెలబ్రిటీలు... ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు తాము పబ్లిక్ లో చేసే ప్రతీ పనిని చాలా ఆలోచించుకొని చేయాలి... తాము చేసే పనుల్లో ఏ ఒక్క చిన్న పొరపాటు దొర్లినా కొన్ని వేల కళ్ళు తమనే చూస్తూ ఉంటాయనీ.. ఎప్పుడెప్పుడు దొరుకుత్ోఅరా అని ఫొటో గ్రాఫర్లు చూస్తూ ఉంటారనీ మర్చిపోకూడదు.. ఇలాగే ఓ పొరపాటు చేసి ఇరుక్కున్నాడు మన టాయ్‌లెట్ హీరో అక్షయ్ కుమార్.

జాతీయ జెండాను త‌ల‌కిందులుగా

జాతీయ జెండాను త‌ల‌కిందులుగా

ఆదివారం ఇండియా, ఇంగ్లండ్ వుమెన్స్ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌ను ప్ర‌త్య‌క్షంగా చూశాడు అక్కీ. ఈ సంద‌ర్భంగా లార్డ్స్ గ్యాల‌రీలో ఇండియ‌న్ ఫ్లాగ్ చేతిలో ప‌ట్టుకొని టీమ్‌ను చీర్ చేస్తున్న ఫొటో ఒక‌టి అత‌ను పోస్ట్ చేశాడు. అయితే ఆ ఫొటోలో మ‌న జాతీయ జెండాను త‌ల‌కిందులుగా ప‌ట్టుకున్నాడు అక్ష‌య్‌.

Allu Arjun's Next Movie Naa Peru Surya Naa Illu India Launched
జెండాను అవ‌మానించ‌డంపై

జెండాను అవ‌మానించ‌డంపై

అత్యుత్సాహం లో ఆ విషయాన్ని అక్కి గమనించలేదు గానీ ఆ ఫొటో చూసిన వాళ్ళు మాత్రం అక్షయ్ వల్ల జరిగిన పొరపాటు అదీ జాతీయ జండా విషయం లో జరిగింది కాబట్టి. దీంతో నెటిజ‌న్లు అత‌న్ని ట్రోల్ చేశారు. జెండాను అవ‌మానించ‌డంపై కొంత‌మంది మండిప‌డ్డారు. దీంతో వెంట‌నే స్పందించిన అక్ష‌య్‌.. ఆ ఫొటోను తొల‌గించాన‌ని మ‌రో ట్వీట్ చేశాడు.

క్ష‌మాప‌ణ‌లు

క్ష‌మాప‌ణ‌లు

ఎవ‌రినీ కించ‌ప‌రిచే ఉద్దేశం త‌న‌కు లేద‌ని, జాతీయ జెండాకు జ‌రిగిన అవ‌మానానికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నానని అక్ష‌య్ ఆ ట్వీట్‌లో తెలిపాడు.నిజానికి అక్షయ్ కుమార్ ఎప్పుడూ దేశభక్తిని ప్రదర్శిస్తూనే ఉంటాడు, సైనికుల కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయటం, రైతుల కోసం పాటుపడటం లోనూ అక్షయ్ ఇప్పటి వరకూ చాలానే చేసాడు.

టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథా

టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథా

ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ గా టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథా చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ దేశభక్తిలో భాగం గానే జండా ఎగరేసి ఉంటాడు గానీ పాపం గమనించుకోక పోవటం తో ఇలా బలి కావాల్సి వచ్చింది. ఎట్టక్లేలకు తన పొరపాటుకు క్షమాపణలు చెప్పుకొని హుందాగా ప్రవర్తించాడు అక్షయ్...

English summary
Akshay Kumar apologised and later took down a controversial picture of himself waving the Indian tricolour at Sundays India vs England Women’s World Cup Final.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu