»   » నటి ఆత్మహత్యకు హీరో సహకారం!.. ఎలా చేశారంటే..

నటి ఆత్మహత్యకు హీరో సహకారం!.. ఎలా చేశారంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజంగా కాదండీ.. జాలీ ఎల్ఎల్బీ 2 సినిమాలో ఓ సీన్‌ సందర్భంగా.. అలాంటి సంఘటన చోటుచేసుకొన్నది. సాధారణంగా ఆత్మహత్య చేసుకోవడం సామాన్య విషయమీ కాదు. సినిమా షూటింగ్‌లో కూడా అలాంటి సీన్లలో నటించడానికి ధైర్యం కావాల్సిందే.

అన్యాయానికి గురైన గర్భవతిగా సయానీ

అన్యాయానికి గురైన గర్భవతిగా సయానీ

ఇటీవల విడుదలైన జాలీ ఎల్ఎల్‌బీ చిత్రంలో అన్యాయానికి గురైన (హీనా) గర్భవతి పాత్రను నటి సయానీ గుప్తా పోషించారు. కథలో భాగంగా ఆమె బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సన్నివేశం సినిమాలో కథ అనూహ్యమైన మలుపు తీరుగడానికి దోహదపడుతుంది.

ఆ సీన్‌లో సయానీకి వణుకు పెట్టిందట..

ఆ సీన్‌లో సయానీకి వణుకు పెట్టిందట..

అలాంటి కీలక సీన్‌లో నటించడానికి సయానీ భయపడిందట. పలుమార్లు రిహార్సల్ చేసినప్పట్టికి ధైర్యం సరిపోలేదట. ఆ చిత్రంలోని హీరో అక్షయ్ కుమార్ వచ్చి చిన్న చిట్కా ఇవ్వడంతో ఆ సన్నివేశంలో నటించడానికి వీలుపడిందని సయానీ ఇటీవల వెల్లడించింది.

స్టంట్ మాస్టర్ చెప్పినా ధైర్యం చాలలేదు

స్టంట్ మాస్టర్ చెప్పినా ధైర్యం చాలలేదు

‘స్టంట్ మాస్టర్ నాకు సీన్ వివరించినపుడు కొంత నెర్వస్‌గా ఫీలయ్యాను. స్టంట్ మాస్టర్ ప్రమేయం లేకుండా నా అంతట నేను నటించాలని అనుకొన్నాను. ఎత్తుపైన నుంచి చూడటమంటే చిన్నప్పటి నుంచి చెప్పలేనంత భయం. అలాంటిది 40 అడుగుల బిల్డింగ్ మీద నుంచి దూకాల్సిన సీన్ చేయాల్సి వచ్చింది. రీహార్సల్ సమయంలో చాలా కష్టమనిపించింది. స్టంట్ డైరెక్టర్ పర్వేజ్ షేక్ ‘భయపడ వద్దు' అని ధైర్యం చెప్పాడు. అయినా నాకు ధైర్యం చాలలేదు' అని సయానీ గుప్తా తెలిపారు.

రంగంలోకి దూకిన అక్షయ్

రంగంలోకి దూకిన అక్షయ్

అప్పుడు నాకు ధైర్యంగా హీరో అక్షయ్ కుమార్ రంగంలోకి దూకారు. స్టంట్ స్వీక్వెన్స్‌లో అక్షయ్ పనితీరు అద్భుతం. చిన్న చిట్కా ఇచ్చి ధైర్యం కల్పించాడు. సన్నివేశం పూర్తేయ్యేలా చొరవ తీసుకొన్నాడు.

కేవలం ఆయన ధైర్యంతోనే.. సీన్ పూర్తి

కేవలం ఆయన ధైర్యంతోనే.. సీన్ పూర్తి

అక్షయ్ ఇచ్చిన ధైర్యంతో ఎలాంటి భయం లేకుండా బిల్డింగ్ మీద నుంచి దూకి సన్నివేశాన్ని చాలా సులభంగా పూర్తి చేశాను. స్టంట్స్ చేయడంలో మాస్టర్ అయిన అక్షయ్‌కుమార్ సహకారం మరిచిపోలేనిది. అక్షయ్ కుమార్ లేకపోతే కలలో కూడా ఆ సన్నివేశాన్ని చేయలేకపోయేదానిని అని ఆమె తెలిపారు.

వంద కోట్ల క్లబ్‌లో జాలీ ఎల్ఎల్బీ2

వంద కోట్ల క్లబ్‌లో జాలీ ఎల్ఎల్బీ2

సుభాష్ కపూర్ దర్శకత్వం వహించిన జాలీ ఎల్ఎల్‌బీ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రంలో అన్నుకపూర్, సౌరభ్ శుక్లా, సయానీ గుప్తా పాత్రలకు మంచి పేరు వచ్చింది.

English summary
Actress Sayani Gupta has a small yet pivotal role in Akshay Kumar's latest film Jolly LLB 2. Akshay Kumar helps a pregnant Sayani Gupta (Hina) the latter commits suicide by jumping from the roof of her house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu