»   » అవసరం తీరగానే హీరోకి హ్యాండిచ్చిన త్రిష

అవసరం తీరగానే హీరోకి హ్యాండిచ్చిన త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవసరం తీరగానే అల్లుడు తత్తికొడుకు అన్నట్లుగా బిహేవ్ చేస్తోంది త్రిష.ఎలాగైనా బాలీవుడ్ లో పాగా వేయాలని తన గురువు ప్రియదర్శన్ ని అడిగితే హీరో అక్షయ్ పర్మిషన్ తీసుకోమని సలహా ఇచ్చారు. అప్పుడు నానా కష్టాలు పడి అక్షన్ ని ఒప్పించి కట్టా మీటా చిత్రంలో ఆఫర్ సంపాదించింది. ఆ తర్వాత కూడా షూటింగ్ జరిగినంతకాలం అక్షయ్ ని పొగుడుతూ తన పని కానిచ్చుకుంది. అయితే షూటింగ్ పూర్తవగానే ఆమె ప్రవర్తన మారిపోయిందంటున్నారు నిర్మాతలు. కట్టా మీటా ప్రోమోషన్ కి అటెండ్ అవమంటే సినిమా షూటింగ్ వరకే నా డేట్స్..కావలంటే చెప్పండి మరికొన్ని డేట్స్ ఇస్తాను కానీ..ఇలా ప్రమేషన్స్,విజయయాత్రలు అని తిరగమంటే కష్టం అని తేల్చి చెప్పేసింది. దాంతో అక్షయ్ తను చెప్తే త్రిష వింటుందని రంగంలోకి దిగాడు. అయితే త్రిష అతనికీ ఆదే విధంగా సమాధానమిచ్చింది. తను కమల్ హాసన్ సరసన చేస్తున్న మన్మధన్ అంబు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నానని, అంతగా తను కావాలంటే కమల్ సార్ వద్ద పర్మిషన్ మీరు తీసుకోండి అని చెప్పింది. దాంతో షాక్ అయిన అక్షయ్..చాలా విసుగ్గా..ప్రియదర్శన్ తో మనమే చేద్దాం ప్రమేషన్ అని చెప్పేసాడుట. ఇక ప్రియదర్శన్ మాత్రం ఈ గొడవలో తనకేమీ సంభందం లేదన్నట్లు ఉండిపోయాడట. అదీ సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu