»   » టాయిలెట్ చుట్టూ తిరిగే ప్రేమ కథలో సూపర్ స్టార్

టాయిలెట్ చుట్టూ తిరిగే ప్రేమ కథలో సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలై రూ.100 కోట్ల కలెక్షన్లతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఎయిర్‌లిఫ్ట్‌ చిత్ర విజయాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే ఆయన తన మరో చిత్రం 'రుస్తుం' షూటింగ్‌ మొదలెట్టి పూర్తి చేసి విడుదలకు సిద్దం చేసారు.

ఎ వెడ్నెస్‌డే, బేబీ, స్పెషల్‌ 26 వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసిన దర్శకుడు నీరజ్‌పాండే దర్శకత్వంలో తెరకెక్కిన 'రుస్తుం'ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రిలీజ్ కు సిద్దంగా ఉన్న ఈ సమయంలో ఇదే కాంబినేషన్ లో మరో చిత్రం ప్రకటించారు. అంటే మరోసారి నీరజ్ పాండే దర్శకత్వంలో అక్షయ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది.

Akshay Kumar, Neeraj Pandey to work together

ఆ చిత్రం టైటిల్ ...టాయిలెట్-ఏక్ ప్రేమ్ కథ అని పెట్టనున్నట్లు. టాయిలెట్ లేదని ఓ ప్రేమ కథ ,వివాహం దగ్గర ఆగిపోవటం అనే పాయింట్ తో స్క్రిప్టు రెడీ చేసినట్లు చెప్తున్నారు. సినిమా పూర్తి కామెడీతో నడుస్తుందని సమాచారం.

నీరజ్‌ పాండే, అక్షయ్‌ కుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పెషల్‌ 26, బేబీ చిత్రాలు భారీ విజయాన్ని అందుకోవటంతో రుస్తం చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించే కథాంశంతో తెరకెక్కిన 'బేబి' చిత్ర స్క్రిప్ట్‌ ఆస్కార్‌ అకాడమీ గ్రంథాలయంలో ఉంచేందుకు ఎంపికైన విషయం తెలిసిందే.

English summary
Akshay Kumar's next with Neeraj Pandey is hilarious, if you read the title of the film. Toilet - Ek Prem Katha is a satirical and comic take on this serious issue. What happens when two people in love cannot be together because of the lack of a toilet in the house?.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu