»   »  నాకు ఈ జాతీయ అవార్డు వద్దు, ఇంత రచ్చ చేస్తున్నారు.. : అక్షయ్ కుమార్

నాకు ఈ జాతీయ అవార్డు వద్దు, ఇంత రచ్చ చేస్తున్నారు.. : అక్షయ్ కుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"నాకు అవార్డు వచ్చినందుకే ఇంత గొడవ అయితే దాన్ని వెనక్కి తీసుకోండి నాకీ అవార్డ్ వద్దు" అంటూ చిరాకు పడ్డాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. గత ఏడాదిలో విడుదలైన సినిమాలకు గానూ ప్రకటించిన జాతీయ అవార్డుల్లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు 'రుస్తుం' సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. దీంతో విమర్శలు చెలరేగాయి. ఇంత కీ ఎందుకా విమర్శలూ అంటే....

మోసం చేయలేదు

మోసం చేయలేదు

‘‘ఈ అవార్డును నేను నిజాయితీతో సంపాదించుకున్నాను. నేనిప్పటివరకూ మోసం చేయలేదు. అవార్డు కోసం ఎవరికైనా ఫోన్‌ చేయడం గాని, నాకు ఫేవర్‌ చేయమని డబ్బులు ఇవ్వడం గానీ చేయలేదు'' అన్నారు హిందీ హీరో అక్షయ్‌ కుమార్‌. జాతీయ ఉత్తమ నటుడిగా అక్షయ్‌కు అవార్డు ఇవ్వడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఏదో రకంగా వివాదం సృష్టిస్తారు

ఏదో రకంగా వివాదం సృష్టిస్తారు

గత పాతికేళ్లుగా నేను వింటూనే ఉన్నాను. ఎప్పుడైనా ఎవరికైనా అవార్డు వచ్చిందంటే దానిమీద బోలెడంత చర్చ మొదలుపెడతారు. ఎవరో ఒకరు ఏదో రకంగా వివాదం సృష్టిస్తారు. ఆ అవార్డు అతడికి వచ్చి ఉండకూడదు.. వేరేవాళ్లకు రావాల్సింది అంటారు. నాకు 26 ఏళ్ల తర్వాత ఈ అవార్డు వచ్చింది. ఇది కూడా మీకు నచ్చకపోతే వెనక్కి తిరిగి తీసేసుకోండి అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.

ప్రియదర్శన్ ఉన్నందుకు

ప్రియదర్శన్ ఉన్నందుకు

అంతకు ముందు అవార్డు పట్ల అక్షయ్‌ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సంతోషం పూర్తిగా అనుభవించకుండానే పాపం అక్కి మీద దాడి మొదలైపోయింది... ఇంతకీ ఈ విమర్శలు అక్షయ్ కు అవార్డు వచ్చినందుకు కాదు.. అవార్డుల కమిటీ అధ్యక్షుడిగా ప్రియదర్శన్ ఉన్నందుకు.

రాక రాక అవార్డు వస్తే

రాక రాక అవార్డు వస్తే

అక్షయ్ కుమార్ కు ప్రియదర్శన్ సన్నిహితుడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాక రాక అవార్డు వస్తే ‘ఇక ఈయన కంటే గొప్ప నటుడు బాలీవుడ్‌లో లేడా.?' అని కొందరు ఔత్సాహిక నెటిజన్లు, అక్షయ్‌కుమార్‌పై దుమ్మెత్తిపోశారు. అక్షయ్‌ మంచి నటుడు కాదని కాదు కానీ, రుస్తుం సినిమాకి అతనికి ఈ అవార్డు ఇవ్వడం మాత్రం చాలా మందికి ఆగ్రహం తెప్పించింది.

జ్యూరీని తప్పుబడుతున్నారు

జ్యూరీని తప్పుబడుతున్నారు

దంగల్‌లో అమీర్‌ఖాన్‌, ఫాన్‌లో షారుక్‌ ఖాన్‌ అంత గొప్ప అభినయంతో అదరగొడితే వాళ్లని కాదని అక్షయ్‌కి అవార్డు ఇవ్వడంతో అందరూ జ్యూరీని తప్పుబడుతున్నారు.నేనెప్పుడూ అవార్డుల్ని కోరుకోలేదు.. ఇన్నాళ్ళకు అవార్డు వచ్చింది.. అది నాకొక గౌరవంగా భావించాను.. దానికి నేను అర్హుడ్ని కాననుకుంటే, దాన్ని మీరే తీసుకోండి.ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు ??

అవార్డుని ఆనందంగా స్వీకరించలేకపోతున్న

అవార్డుని ఆనందంగా స్వీకరించలేకపోతున్న

అంటూ అక్షయ్ ఆగ్రహానికి గురయ్యాడట.పాతికేళ్ల నట జీవితంలో తొలిసారిగా వచ్చిన జాతీయ అవార్డుని ఆనందంగా స్వీకరించలేకపోతున్న అక్షయ్‌ ఇప్పటికే ఈ అవార్డు కొనుక్కోలేదని, లాబీయింగ్‌ చేయలేదని వివరణ ఇచ్చుకున్నాడు. తనకు సన్నిహితులైన అక్షయ్ కుమార్.. మోహన్ లాల్ లకు అవార్డులు కట్టబెట్టడం ద్వారా ప్రియదర్శన్ పక్షపాతం చాటుకున్నాడని చాలామంది బాలీవుడ్ జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు.

డైరెక్టర్ మురుగదాస్ సైతం

డైరెక్టర్ మురుగదాస్ సైతం

స్వయంగా సౌత్ ఇండియన్ డైరెక్టర్ మురుగదాస్ సైతం అవార్డుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రియదర్శన్ పై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరింది.ప్రియదర్శన్ మీడియా వాళ్లతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

అప్పుడెవరూ ప్రశ్నించలేదు

అప్పుడెవరూ ప్రశ్నించలేదు

రమేష్ సిప్పీ జ్యూరీకి నేతృత్వం వహించినపుడు అమితాబ్ బచ్చన్ కు.. ప్రకాశ్ ఝా జ్యూరీ హెడ్ గా ఉన్నపుడు అజయ్ దేవగన్ కు అవార్డులు వచ్చాయని.. అప్పుడెవరూ ప్రశ్నించలేదని.. కానీ ఇప్పుడు తన మీద మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారని అన్నాడు. ఈ మాట అనడం ద్వారా తాను కూడా వాళ్ల బాటలోనే తన మిత్రులకు అవార్డులు ఇచ్చుకున్నానని ప్రియదర్శన్ చెప్పకనే చెప్పేసాడు.

అమీర్ అవార్డు తీసుకోలేదని

అమీర్ అవార్డు తీసుకోలేదని

సరే మరి ఈ జ్యూరీ ‘దంగల్'లో గొప్పగా నటించిన అమీర్ ను అవార్డుకు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని అడిగితే.. అమీర్ ఇంతకుముందు 2007లో జాతీయ అవార్డుకు ఎంపికైనపుడు వచ్చి అవార్డు తీసుకోలేదని.. అవార్డుల పట్ల గౌరవం లేనపుడు ఎందుకు అతణ్ని ఎంపిక చేయాలంటూ ప్రియదర్శన్ ప్రశ్నించడం కూడా విమర్శల పాలవుతోంది.

హోమోసెక్సువాలిటీ

హోమోసెక్సువాలిటీ

చాలా బాలీవుడ్ చిత్రాలను హోమోసెక్సువాలిటీ ఇతివృత్తం ఆధారంగా నిర్మించారు. ప్రాంతీయ చిత్రాలే సామాజిక సమస్యలను చూపాయి. భారతీయ సంస్కృతిని చాటిచెప్పే చిత్రాలను మేము ప్రోత్సహించాలి. ఈ విషయంలో ప్రాంతీయ చిత్రాలు అద్భుతంగా కృషి చేస్తున్నాయి అని ప్రియదర్శన్ చెప్పటం మరో రకమైన వివాదానికీ తెర తీసెలా ఉంది....

English summary
Akshay Kumar won his first National Award this year in the best actor category for his role in Rustom. The decision, however, was met with criticism with many arguing that it was not fair.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu